Telugu Global
Others

సర్దార్ జీ జోక్స్ పై సుప్రీంకోర్టుకు

సర్దార్ జీ పేరుతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, వివిధ బ్లాగుల్లో మనకు తెలిసి ఎన్నో జోకులు ఉంటాయి. వాటిని చదివిన వారంతా, చూసిన వారంతా ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. అయితే ఇవి సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ ఓ మహిళ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్దార్ జీ జోకులను ప్రచురిస్తున్న సుమారు 5వేల వెబ్ సైట్లను బ్యాన్ చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ వైబ్ సైట్లలో ఉంటున్న జోకులు సిక్కులను అసభ్య పదజాలంతో దూషించడం, […]

సర్దార్ జీ జోక్స్ పై సుప్రీంకోర్టుకు
X

సర్దార్ జీ పేరుతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, వివిధ బ్లాగుల్లో మనకు తెలిసి ఎన్నో జోకులు ఉంటాయి. వాటిని చదివిన వారంతా, చూసిన వారంతా ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. అయితే ఇవి సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ ఓ మహిళ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్దార్ జీ జోకులను ప్రచురిస్తున్న సుమారు 5వేల వెబ్ సైట్లను బ్యాన్ చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ వైబ్ సైట్లలో ఉంటున్న జోకులు సిక్కులను అసభ్య పదజాలంతో దూషించడం, కించపరచడం చేస్తున్నారని పిటిషన్ లో ఆమె సూచించారు.
అయితే సిక్కు కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఎంతో గొప్ప హాస్య ప్రియులని, సర్దార్ జీ జోకులను సిక్కులు కూడా ఆనందిస్తుంటారని జస్టిస్ థాకూర్ అన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడయిన కుశ్వంత్ సింగ్ కూడా వీటిపై పుస్తకాన్ని రాశారని ఆయన గుర్తు చేశారు.
అయితే హాస్యం, జోకులు అనేవి కమ్యూనిటీలో భాగమే అయినా అవి జాతిని కించపర్చేలా ఉంటున్నాయని.. అలా ఉండకూడదనే తమ ఉద్దేశ్యమని పిటిషనర్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాకుండా తమ కమ్యూనిటిపై విదేశీ వెబ్ సైట్లలోనూ అసభ్యకరమైన రీతిలో జోకులు ఉంటున్నాయని ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ టీఎస్.థాకూర్, వీ. గోపాల గౌడ విచారణకు ఆరువారాలు గడువు ఇచ్చారు. ఈలోపు సిక్కు కమ్యూనిటీని సర్దార్ జీ జోకులు ఏవిధంగా ఇబ్బంది కలిగిస్తున్నాయో ఆధారాలు ఇవ్వాలని పిటిషనర్ హర్వీందర్ చౌదరీకి సూచించారు. అదే సమయంలో ఈ కేసును జస్టిస్ జేఎస్ ఖేహార్ బెంచ్ కు బదిలీ చేశారు.

First Published:  31 Oct 2015 1:32 AM GMT
Next Story