శ్రుతి హాస‌న్ ముద్దు కావాలా ..?

అందమైన ఆడ‌పిల్ల గాలి సోకితేనే.. అల్లాడిపోయే కుర్రకారుకి హీరోయిన్ ముద్దు ఇస్తానంటే.. తీసుకోకుండా ఎలా ఉంటారు? అందులోనూ శ్రుతీహాస‌న్‌లాంటి క‌త్తిలాంటి కుర్ర‌హీరోయిన్ ఇస్తే.. కాద‌న‌కుండా ఎలా వ‌ద్దంటారు? అయితే ఆగండి.. అంత‌టితో మీ ఆతృత‌ను క‌ట్టి పెట్టండి. శ్రుతి ముద్దు నేరుగా కాదు.. అందుకు కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి..ఈ ముద్దులు అంద‌రికీ కాదు.. కేవ‌లం ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌ను ఫాలో అయ్యేవారికి మాత్ర‌మే..! విష‌య‌మేంటంటే..? ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన శ్రుతిహాస‌న్ ఫాలోయర్ల సంఖ్య‌ 1 మిలియ‌న్‌కు చేరుకుంది. అంటే అక్ష‌రాల 10,00,000 (ప‌దిల‌క్ష‌ల‌) మంది అన్న‌మాట‌. అమ్మో! ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఇంతమంది ఉంటే.. ఇక ట్విట్ట‌ర్, ఫేస్‌బుక్ ఫాలోయర్ల సంఖ్య ఇందుకు రెట్టింపే ఉంటుంది. అందుకే త‌న‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత‌లా ఆద‌రిస్తున్న త‌మ అభిమానుల‌కు ముద్దులు పెట్టి మ‌రీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ట్విట్ట‌ర్‌లో ఫొటోను పోస్ట్ చేసింది. మ‌రి, ఇలాంటి ట్విట్ట‌ర్ ముద్దులు కావాలంటే.. ఇంకెందుకు ఆల‌స్యం..? మీరు కూడా శ్రుతిని సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో ఫాలో అవండి..!