Telugu Global
CRIME

ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన 180 మంది మైనర్‌ డ్రైవర్లు!

నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 201 మంది రైడర్లను ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. విశేషమేమిటంటే వీరిలో 180 మంది మైనర్లున్నారు. 150 సీసీ, 180 సీసీ బైక్‌లు తల్లిదండ్రులు పిల్లల చేతికిచ్చి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ అన్నారు. ఈ మైనర్ల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వకూడదని, పిల్లలు వాహనాల డ్రైవింగ్‌లో తప్పిదాలకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవలసింది తల్లిదండ్రులేనని ఆయన హితవు చెప్పారు. వారు నడిపే వాహనాల […]

ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన 180 మంది మైనర్‌ డ్రైవర్లు!
X

నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 201 మంది రైడర్లను ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. విశేషమేమిటంటే వీరిలో 180 మంది మైనర్లున్నారు. 150 సీసీ, 180 సీసీ బైక్‌లు తల్లిదండ్రులు పిల్లల చేతికిచ్చి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ అన్నారు. ఈ మైనర్ల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వకూడదని, పిల్లలు వాహనాల డ్రైవింగ్‌లో తప్పిదాలకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవలసింది తల్లిదండ్రులేనని ఆయన హితవు చెప్పారు. వారు నడిపే వాహనాల వల్ల ప్రమాదానికి గురైతే ఆస్పత్రుల పాలవుతారని, ఎదుటివారిని ప్రమాదానికి గురి చేస్తే జైలు పాలవుతారని, కొన్నిసార్లు డ్రైవింగ్‌ చేస్తున్న పిల్లలకుగాని, వీరివల్ల ఎదుటివారికి గాని మరణాలు కూడా సంభవించవచ్చని డీసీపీ హెచ్చరించారు. మైనర్లను తొలిసారి పట్టుకున్న కారణంగా కౌన్సిలింగ్‌తో వదిలి వేస్తున్నామని, మరోసారి వాహనం నడుపుతూ రోడ్లపై కనిపిస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. పట్టుబడిన పిల్లల్లో ఎక్కువ మంది బైక్‌ల్లో పాఠశాలలకు వెళుతున్నారని తల్లిదండ్రులు చెప్పడం విశేషం. తమ పిల్లలకు మైనారిటీ తీరకుండా వాహనాలు ఇవ్వబోమని తల్లిదండ్రులతో ప్రమాణం చేయించుకుని బైక్‌లను, పిల్లలను వారికి అప్పగించారు.

First Published:  31 Oct 2015 10:59 AM GMT
Next Story