Telugu Global
National

బీహార్‌ ఐదో విడతలోనే బీజేపీ గెలుపు కథ తేలేది 

బీహార్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల్లో 57.59% పోలింగ్ నమోదైంది. ఈ విడతలో మొత్తం 55 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 57 మంది మహిళా అభ్యర్ధులతో పాటు 776 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బీహార్ అసెంబ్లీ చివరి విడత ఎన్నికలు భారతీయ జనతాపార్టీకి పెద్ద సవాలు విసిరేవే. ఎందుకంటే ఐదో విడత ఎన్నికలు జరిగే 57 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లు ఎక్కువ. ముస్లిం ఆధిక్య సీమాంచల్‌లో, మిథిలాంచల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 2014లో […]

బీహార్‌ ఐదో విడతలోనే బీజేపీ గెలుపు కథ తేలేది 
X
బీహార్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల్లో 57.59% పోలింగ్ నమోదైంది. ఈ విడతలో మొత్తం 55 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 57 మంది మహిళా అభ్యర్ధులతో పాటు 776 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బీహార్ అసెంబ్లీ చివరి విడత ఎన్నికలు భారతీయ జనతాపార్టీకి పెద్ద సవాలు విసిరేవే. ఎందుకంటే ఐదో విడత ఎన్నికలు జరిగే 57 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్లు ఎక్కువ. ముస్లిం ఆధిక్య సీమాంచల్‌లో, మిథిలాంచల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 2014లో ఇక్కడి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్క స్థానాన్ని కూడా బీజేపీ దక్కించుకోలేక పోయింది. అయితే తాజా ఎన్నికల్లో తాము మెజార్టీ సీట్లు గెలుచుకోగలమని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఈసారి తొలిసారిగా సీమాంచల్‌లో ఎంఐఎం పోటీ దిగుతోంది. ఒవైసీ సోదరులు సీమాంచల్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది బీజేపీకే కాకుండా మహా కూటమి నేతలకు కూడా పెద్ద సవాలు విసిరినట్టయ్యింది. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూర్చడానికి ఒవైసీ డీల్ కుదుర్చుకున్నారని, అందుకే ఇక్కడ ఎంఐఎం పోటీ చేసిందని మహా కూటమి నేతలు ఆరోపించారు కూడా. ముస్లిం ఓట్లను ఎంఐఎం ఏకీకృతం చేస్తే హిందువుల ఓట్లు గంపగుత్తగా తమకు పడే అవకాశం ఉందని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం బీహార్‌ ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారనేది ఈ నెల 8వ తేదీని బ్యాలెట్‌ బాక్సుల నుంచి బయటపడనుంది.
First Published:  1 Nov 2015 9:43 AM GMT
Next Story