Telugu Global
CRIME

బెయిల్‌ వచ్చిన వెంటనే ఆస్పత్రి నుంచి డిఛార్జ్‌

సంచలనం సృష్టించిన శారద కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి మదన్ మిత్రకు బెయిల్ వచ్చిన మరుసటి రోజే ఆస్పత్రికి మంగళం పాడేసి తన నివాసానికి చేరారు. శారదా కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు గత ఏడాది డిసెంబర్ 12న ఈ మంత్రిని అరెస్టు చేసింది. అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చేరి వీవీఐపీలకు ప్రత్యేక చికిత్సనందించే విభాగంలో గడుపుతూ వచ్చారు. డిసెంబర్ 19న ఆయనను సీబీఐ కస్టడీకి తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 50 రోజులు […]

సంచలనం సృష్టించిన శారద కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి మదన్ మిత్రకు బెయిల్ వచ్చిన మరుసటి రోజే ఆస్పత్రికి మంగళం పాడేసి తన నివాసానికి చేరారు. శారదా కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు గత ఏడాది డిసెంబర్ 12న ఈ మంత్రిని అరెస్టు చేసింది. అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చేరి వీవీఐపీలకు ప్రత్యేక చికిత్సనందించే విభాగంలో గడుపుతూ వచ్చారు. డిసెంబర్ 19న ఆయనను సీబీఐ కస్టడీకి తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 50 రోజులు మాత్రమే జైలులో గడిపిన ఆయన బెయిల్‌ కోసం అనేకసార్లు పిటిషన్‌లు పెట్టుకున్నారు. ఇపుడు బెయిల్‌ వచ్చి 24 గంటలు గడిచిందో లేదో ఒక్క క్షణం కూడా ఆస్పత్రిలో ఉండకుండా వెంటనే ఇంటి బాట పట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.

First Published:  31 Oct 2015 3:02 PM GMT
Next Story