Telugu Global
Cinema & Entertainment

చారిత్రక సినిమాపై మనసుపారేసుకున్నాడు

ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించాడు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. అటు తమిళనాట విజయ్ పులి అనే సినిమాలో నటించాడు. బాహుబలిలా ప్రభంజనం కాకపోయినా, విజయ్ స్టామినాను చూపించింది ఆ సినిమా. మరోవైపు అనుష్క కూడా రుద్రమదేవి గాధతో సినిమా చేసింది. ఇవన్నీ చూసిన అజిత్ కు కూడా హిస్టారికల్ మూవీపై మనసు మళ్లింది. ఇన్నాళ్లూ యాక్షన్-సస్పెన్స్ సినిమాలతో బిజీగా ఉన్న అజిత్, కుదిరితే ఏదైనా ఒక చారిత్రక కథాంశాన్ని సినిమాగా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాడు. నిజంగా అజిత్ […]

చారిత్రక సినిమాపై మనసుపారేసుకున్నాడు
X

ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించాడు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. అటు తమిళనాట విజయ్ పులి అనే సినిమాలో నటించాడు. బాహుబలిలా ప్రభంజనం కాకపోయినా, విజయ్ స్టామినాను చూపించింది ఆ సినిమా. మరోవైపు అనుష్క కూడా రుద్రమదేవి గాధతో సినిమా చేసింది. ఇవన్నీ చూసిన అజిత్ కు కూడా హిస్టారికల్ మూవీపై మనసు మళ్లింది. ఇన్నాళ్లూ యాక్షన్-సస్పెన్స్ సినిమాలతో బిజీగా ఉన్న అజిత్, కుదిరితే ఏదైనా ఒక చారిత్రక కథాంశాన్ని సినిమాగా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాడు. నిజంగా అజిత్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే. ఈ వార్తకు మరింత బలం చేకూర్చేలా ఈమధ్య దర్శకుడు విష్ణువర్థన్ ఓ ట్వీట్ చేశాడు. త్వరలోనే అజిత్, విష్ణువర్థన్ తో సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఓ హిస్టారికల్ స్టోరీకి స్క్రీన్ ప్లే రాస్తున్నానంటూ విష్ణువర్థన్ ట్వీట్ చేశాడు. దీంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా అజిత్ వైపు తిరిగింది.

First Published:  31 Oct 2015 7:06 PM GMT
Next Story