హ‌ర్భ‌జ‌న్ పెళ్లి…పొగాకు తంటా..!

భార‌త‌ క్రికెట్ క్రీడాకారుడు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌కి త‌న‌ పెళ్లి, ఆనందాల‌తో పాటు ప‌లు విమ‌ర్శ‌ల‌ను, పోలీసు కేసుల‌కు మోసుకొస్తోంది. ఇప్ప‌టికే పెళ్లిలో ఫొటో జ‌ర్న‌లిస్టుల‌ను  కొట్టినందుకు న‌లుగురు బౌన్స‌ర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా పెళ్లిలో 113 ర‌కాలుగా పొగాకుని ఆహుతుల‌కు అందించినందుకు సిక్కు మ‌త సంస్థ‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి. సిక్కుల‌ అత్యున్న‌త మ‌త సంస్థ అకాలిత‌క్త్‌కి సైతం దీనిపై ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టుగా సిక్కు మ‌త పెద్ద‌లు ప్ర‌క‌టించారు. హ‌ర్భ‌జ‌న్‌పై చ‌ర్య తీసుకోవాల‌ని స‌ద‌రు మ‌త‌ సంస్థ‌లు ప‌ట్టుబ‌డుతున్నాయి. పొగాకు, ఆల్క‌హాల్ వినియోగానికి సిక్కు మ‌తం పూర్తిగా వ్య‌తిరేకం. ఈ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తే క‌ఠినమైన చ‌ర్య‌లు తీసుకున్న సంద‌ర్భాలున్నాయి.

గ‌త గురువారం త‌న చిన్న‌నాటి స్నేహితురాలు గీతా బస్రాని హ‌ర్భ‌జ‌న్ సింగ్ వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లిలో త‌న మ‌నుషులు మీడియా ప‌ర్స‌న్స్ మీద  చేయిచేసుకున్నారు. బాధితులు, ఆందోళ‌న కారులు హ‌ర్భ‌జ‌న్ ఇంటిముందు ధ‌ర్నా చేయ‌డంతో అత‌ను వారికి క్ష‌మాప‌ణ చెప్పి శాంత‌ప‌ర‌చాడు. ఇప్పుడు ఈ స్పిన్ బౌల‌ర్ మ‌రొక స‌మ‌స్య‌లో ఇరుక్కున్న‌ట్టే ఉంది.