మురుగుదాస్ దర్శకత్వంలో మహేష్

ప్రస్తుతం బ్రహ్మోత్సవం అనే సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉంటుండగానే అప్పుడే మరో సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చాడు. మురుగదాస్ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకున్నాడు మహేష్. సందేశాత్మకంగా రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభం అవుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ 12న మురుగదాస్-మహేష్ నయా ప్రాజెక్ట్ షురూ అవుతుంది. 
నిజానికి కొన్నేళ్లుగా మహేష్ కు ఏవో ఒక కథలు వినిపిస్తూనే ఉన్నాడు మురుగదాస్. కానీ మురుగదాస్ చెప్పిన సందేశాత్మక కథల్ని మహేష్ ఒప్పుకోలేకపోయాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఈ హీరో మైండ్ సెట్ ను మార్చేసింది. ఎంటర్ టైనింగ్ గా ఉంటూనే సందేశం ఇవ్వొచ్చని అర్థమైంది. అందుకే వెంటనే మురుగదాస్ చెప్పిన కథకు ఓకే చేశాడు. ప్రస్తుతం మురుగదాస్ ఈ ప్రాజెక్ట్ పనిమీదే ఉన్నాడు. మరో 2 నెలల్లో మొత్తం స్క్రీన్ ప్లేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎవరనేది నిర్ణయిస్తారు.