Telugu Global
Others

భువన కిడ్నాప్‌ కేసులో తలసాని ట్విస్ట్

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కుమారుడు తన భార్య భువనను కిడ్నాప్ చేశారంటూ అభినవ్ అనే వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు కొత్త మలుపు తిరిగింది. బాధితురాలు భువనయే అసలు ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇచ్చారు. భర్త అభినవ్‌పైనే భవన ఆరోపణలు గుప్పించారు. అభినవ్  తనను టార్చర్ పెట్టారని ఆమె ఆరోపించారు. తన కుమారుడే కిడ్నాప్ చేశారని ఆరోపణలు రావడంతో స్వయంగా మంత్రి తలసానిశ్రీనివాస యాదవే భువన, ఆమె తండ్రి మహేందర్ రెడ్డిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్బంగా అనేక […]

భువన కిడ్నాప్‌ కేసులో తలసాని ట్విస్ట్
X

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కుమారుడు తన భార్య భువనను కిడ్నాప్ చేశారంటూ అభినవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు కొత్త మలుపు తిరిగింది. బాధితురాలు భువనయే అసలు ఏం జరిగిందన్న దానిపై వివరణ ఇచ్చారు.

భర్త అభినవ్‌పైనే భవన ఆరోపణలు గుప్పించారు. అభినవ్ తనను టార్చర్ పెట్టారని ఆమె ఆరోపించారు. తన కుమారుడే కిడ్నాప్ చేశారని ఆరోపణలు రావడంతో స్వయంగా మంత్రి తలసానిశ్రీనివాస యాదవే భువన, ఆమె తండ్రి మహేందర్ రెడ్డిని మీడియా ముందుకు తీసుకొచ్చారు.

ఈ సందర్బంగా అనేక అంశాలను భువన వివరించారు. తాను అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి అని, జిమ్ కు వెళ్లే సమయంలో అభినవ్ పరిచయం అయ్యాడని చెప్పింది. ఆ తర్వాత తమ మధ్య స్నేహం పెరిగిందంది. ఓసారి మ్యాచ్ ఓడిపోవడంతో తన తండ్రి తిట్టారని ఆ సమయంలోనే తాను అభినవ్‌తో వెళ్లిపోయానని చెప్పింది. వెంటనే ఇద్దరూ వివాహం చేసుకున్నట్టు తెలిపింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే అభినవ్ అసలు రూపం బయటపడిందని వాపోయింది. టెన్నిస్ ఆట ఆడనివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడని, బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెట్టి డోర్ వేసేవాడని ఆవేదన చెందింది. ప్రతి రోజూ చిత్ర హింసలు పెట్టేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆరోపించింది. అక్క పెళ్లికి పిలించేందుకు వచ్చిన తన తండ్రి మహేంద్రరెడ్డిని మూడుకోట్లు డిమాండ్ చేశారని భువన ఆరోపించారు.

అక్టోబర్ 24 రాత్రి తనను ఇంట్లో దింపేసి వెళ్లాడని అయితే వెంటనే వచ్చి తిరిగి రావాల్సిందిగా ఒత్తిడి చేశాడని ఆమె చెప్పింది. ఆ సమయంలో తన తండ్రి మహేందర్ రెడ్డిని అభినవ్ తీవ్రంగా కొట్టాడని భువన చెబుతున్నారు. భువన తండ్రి మహేందర్ రెడ్డిది కడప జిల్లా. భువన ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు అభినవ్‌‌పై బేగంపేట పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.. తప్పంతా అభినవ్ దగ్గర పెట్టుకుని అందరిపైనా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముందు మండిపడ్డారు. భువన వివాదంతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అభివన్‌ తన తొలి వివాహం అంశాన్ని దాచిపెట్టి మోసం చేశారని తలసాని చెప్పారు.

First Published:  1 Nov 2015 9:16 AM GMT
Next Story