Telugu Global
NEWS

దయాకర్‌కు టీఆర్‌ఎస్‌ తరఫున రూ.70 లక్షల చెక్కు

వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తాము నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్‌కే పరిస్థితి అనుకూలంగా ఉన్నట్టు వెల్లడైందని,  తమ ప్రభుత్వం అధికారం చేపట్టి కొన్నాళ్లే అయినా.. 99 శాతం వాగ్దానాలు నిలబెట్టుకోవడం వల్లే ప్రజల నుంచి ఈ అబిప్రాయం వ్యక్తమయ్యిందని కేసీఆర్ అన్నారు. ఇవాళ దేశంలోని అనేక రాష్ర్టాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, బీహార్ ఎన్నికల్లో ఆ […]

దయాకర్‌కు టీఆర్‌ఎస్‌ తరఫున రూ.70 లక్షల చెక్కు
X

వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తాము నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్‌కే పరిస్థితి అనుకూలంగా ఉన్నట్టు వెల్లడైందని, తమ ప్రభుత్వం అధికారం చేపట్టి కొన్నాళ్లే అయినా.. 99 శాతం వాగ్దానాలు నిలబెట్టుకోవడం వల్లే ప్రజల నుంచి ఈ అబిప్రాయం వ్యక్తమయ్యిందని కేసీఆర్ అన్నారు. ఇవాళ దేశంలోని అనేక రాష్ర్టాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, బీహార్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తనను గెలిపిస్తే తెలంగాణలో మాదిరిగా వాటర్‌గ్రిడ్ చేపడతానని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు పార్టీ ఏ, బీ ఫారంలను, ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.70 లక్షల చెక్కును, పార్టీ అభ్యర్థి దయాకర్‌కు ఫారం-ఏ, బీ కేసీఆర్ అందజేశారు.

First Published:  1 Nov 2015 1:15 AM GMT
Next Story