Telugu Global
Cinema & Entertainment

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

11 ఏళ్ల త‌రువాత తెలుగు ఇండ‌స్ర్టీలో హిట్టు కొట్టిన హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌రువాత చేసిన రాంబాబు ప్రాజెక్టు నిరాశ‌ప‌రిచినా.. అత్తారింటికి దారేది, గోపాల.. గోపాల స‌క్సెస్‌తో మాంచి ఊపు మీదున్న సంగ‌తి తెలిసిందే! ఇదే ఊపుతో గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ అయిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌-2 ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు ప‌వ‌ర్‌స్టార్‌. ఈ సినిమాకు ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు విన‌బ‌డినా.. చివ‌రికి ప‌వ‌ర్ సినిమా ద‌ర్శ‌కుడు బాబీకి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే […]

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు?
X
11 ఏళ్ల త‌రువాత తెలుగు ఇండ‌స్ర్టీలో హిట్టు కొట్టిన హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌రువాత చేసిన రాంబాబు ప్రాజెక్టు నిరాశ‌ప‌రిచినా.. అత్తారింటికి దారేది, గోపాల.. గోపాల స‌క్సెస్‌తో మాంచి ఊపు మీదున్న సంగ‌తి తెలిసిందే! ఇదే ఊపుతో గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ అయిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌-2 ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు ప‌వ‌ర్‌స్టార్‌. ఈ సినిమాకు ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు విన‌బ‌డినా.. చివ‌రికి ప‌వ‌ర్ సినిమా ద‌ర్శ‌కుడు బాబీకి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ద‌క్కింది. ప‌వ‌ర్‌స్టార్ సినిమా చేసే అవ‌కాశం రావ‌డంతో ఎగిరి గంతేసిన బాబీ ఇప్పుడు నేల‌చూపులు చూస్తున్నాడంట‌.
అన్నీంట్లోనూ వేలు..!
ప‌వ‌న్ ద‌ర్శ‌కుల ప‌నిలో ఎక్కువ‌గా ఇన్వాల్వ్ అవుతాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో మొద‌టి నుంచి ఉంది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు బాబీ అయిన‌ప్ప‌టికీ అన్ని విష‌యాలు పవ‌న్‌క‌ల్యాణే చూసుకుంటున్నాడ‌ట‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌-2 సినిమా స్క్రిప్టు, డాన్సులు, ఫైట్ల విష‌యంలో అన్నింట్లోనూ ప‌వ‌న్ జోక్యం చేసుకుంటున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. అప్పుడెప్పుడో ఖుషీ సినిమాలో ఫైట్స్‌, డాన్స్‌ల‌లో త‌న ప్ర‌తిభ చూపెట్టిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌లోని ద‌ర్శ‌కుడు ఇప్పుడు మళ్లీ నిద్ర‌లేచాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అస‌లు ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న విష‌యం త‌న‌కే అర్థం కావ‌డం లేద‌ని బాబీ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. ఇటీవ‌ల ప‌వ‌న్‌పై చిత్రించిన ఐటెంసాంగ్‌కూ స్టెప్పులను తానే కంపోజ్ చేసుకున్నాడ‌ని గుస‌గుస‌లు బ‌య‌ల్దేరాయి. ఈ సినిమాకు ఫైట్ మాస్ట‌ర్లుగా రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌లు ప‌నిచేస్తున్నా… పోరాట స‌న్నివేశాలు కూడా ప‌వ‌నే కంపోజ్ చేసుకుంటున్నాడ‌ని గాసిప్స్ ఊపందుకున్నాయి.
First Published:  31 Oct 2015 7:11 PM GMT
Next Story