Telugu Global
Cinema & Entertainment

ట్విట్టర్ సాక్షిగా రిలీజ్ డేట్ ఫిక్స్

ఈసారి సినిమా వాయిదా పడదు. కచ్చితంగా థియేటర్లలోకి వచ్చి తీరుతుంది. నాగార్జున అలా సెట్ చేశాడు. అఖిల్ కూడా ఫిక్స్ అయ్యాడు. అవును..దీపావళి కానుకగా అఖిల్ సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అందర్లా ప్రెస్ నోట్ విడుదల చేసి చెప్పనప్పటికీ.. అంతకంటే కాస్త స్ట్రాంగ్ గానే చెప్పారు. అవును.. సినిమా యూనిట్ అంతా ట్విట్టర్ వేదికగా అఖిల్ సినిమా రిలీజ్ ను పక్కా చేసింది. నాగార్జున తన ట్విట్టర్ పేజ్ లో ఈ విషయాన్ని నిర్థారించాడు. […]

ట్విట్టర్ సాక్షిగా రిలీజ్ డేట్ ఫిక్స్
X
ఈసారి సినిమా వాయిదా పడదు. కచ్చితంగా థియేటర్లలోకి వచ్చి తీరుతుంది. నాగార్జున అలా సెట్ చేశాడు. అఖిల్ కూడా ఫిక్స్ అయ్యాడు. అవును..దీపావళి కానుకగా అఖిల్ సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అందర్లా ప్రెస్ నోట్ విడుదల చేసి చెప్పనప్పటికీ.. అంతకంటే కాస్త స్ట్రాంగ్ గానే చెప్పారు. అవును.. సినిమా యూనిట్ అంతా ట్విట్టర్ వేదికగా అఖిల్ సినిమా రిలీజ్ ను పక్కా చేసింది. నాగార్జున తన ట్విట్టర్ పేజ్ లో ఈ విషయాన్ని నిర్థారించాడు. అఖిల్ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 11న వస్తోందని ప్రకటించాడు. మరోవైపు హీరో అఖిల్ కూడా తన సినిమా నవంబర్ 11న థియేటర్లలోకి వస్తోందని ఘనంగా ప్రకటించాడు. మరోవైపు నిర్మాత నితిన్, మాటల రచయిత కోన వెంకట్ కూడా అఖిల్ సినిమా విడుదల తేదీని కన్ ఫర్మ్ చేశారు. ఓవైపు దీపావళి రేసు నుంచి కమల్ హాసన్, రవితేజ తప్పుకోవడం కూడా అఖిల్ కు కలిసొచ్చే అంశమే. హీరోగా తొలి సినిమాతో తెలుగుతెరపైకివస్తున్న ఈ అక్కినేని నటవారసుడు దీపావళికి బాక్సాఫీస్ లో ఎన్ని టపాసులు పేలుస్తాడో చూడాలి.
First Published:  1 Nov 2015 7:03 PM GMT
Next Story