Telugu Global
Others

మోదీ ఇలాకా వారణాసిలో బీజేపీకి ఎదురుగాలి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. వారణాశి పరిధిలో 48 జిల్లా పంచాయతీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు కేవలం 08 స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. అధికార సమజ్వాదీ పార్టీ బలపరిచిన 25 మంది అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. మిగిలిన స్థానాల్లో బీఎస్పీ 3, అప్నాదళ్ 4, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించగా మిగిలిన స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు […]

మోదీ ఇలాకా వారణాసిలో బీజేపీకి ఎదురుగాలి
X

ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. వారణాశి పరిధిలో 48 జిల్లా పంచాయతీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు కేవలం 08 స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. అధికార సమజ్వాదీ పార్టీ బలపరిచిన 25 మంది అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. మిగిలిన స్థానాల్లో బీఎస్పీ 3, అప్నాదళ్ 4, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించగా మిగిలిన స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. కనీసం మోదీ దత్తత తీసుకున్న గ్రామం జయపూర్‌లో సైతం బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఇక్కడ బీజేపీ మద్దతుదారు బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా సెక్టార్ 1, 7లలో బీజేపీకి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ మద్దతు ఇచ్చిన జిల్లా పంచాయత్ ఛైర్మన్‌ అభ్యర్థి సుజీత్ సింగ్ విజయం సాధంచారు. వారణాసిలో భారతీయ జనతాపార్టీకి లభించిన ఫలితాలు త్వరలో వెల్లడయ్యే బీహార్‌ ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తే మోదీకి అంతకంటే అపఖ్యాతి మరొకటి ఉండదనే చెప్పాలి.

First Published:  2 Nov 2015 10:02 AM GMT
Next Story