Telugu Global
Others

క్యాన్సర్ కు దానిమ్మతో చెక్

దానిమ్మ పండు. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది దానిమ్మ పండు తినడానికి ఆసక్తి చూపరు. కారణం దానిమ్మ గింజలను వలుచుకుని తినడం టైమ్ తో కూడిన పని అనుకుంటారు. కానీ కొంచెం బద్దకం వదిలి దానిమ్మ పండును ఓపిగ్గా తింటే ఆరోగ్యానికి ఎన్నో రెట్లు మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. దానిమ్మలో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలిక్ […]

క్యాన్సర్ కు దానిమ్మతో చెక్
X

దానిమ్మ పండు. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది దానిమ్మ పండు తినడానికి ఆసక్తి చూపరు. కారణం దానిమ్మ గింజలను వలుచుకుని తినడం టైమ్ తో కూడిన పని అనుకుంటారు. కానీ కొంచెం బద్దకం వదిలి దానిమ్మ పండును ఓపిగ్గా తింటే ఆరోగ్యానికి ఎన్నో రెట్లు మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. దానిమ్మలో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్ బ్రెస్ట్, ప్రోస్టేట్, స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చర్మంపై రాస్తే సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షిస్తుంది.
ఇక గర్భిణులు కూడా రోజుకు గ్లాసు దానిమ్మ రసం తాగితే కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. క్రమం తప్పకుండా దానిమ్మ తింటే చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. నీళ్ళ విరేచినాలతో బాధపడుతున్నప్పుడు ఈరసం తాగితే త్వరగా ఉపసమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటి వైరల్, యాంటి బాక్టిరియాల్ గుణాలు గొంతు నొప్పులనూ నివారిస్తుంది. దానిమ్మలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రొమ్ము, పెద్ద పేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను రాకుండా చూస్తుంది .
వంద గ్రాముల దానిమ్మలో 83 కేలరీల సామర్థ్యం శరీరానికి లభిస్తుంది. ఇది ఆపిల్ కంటే ఎక్కువ. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే పీచు పదార్థాలు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల దానిమ్మలో నాలుగు గ్రాముల పీచు ఉంది. ఇది జీర్ణశక్తికి, ప్లేగు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రోజుకో దానిమ్మను తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా దానిమ్మ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగంతోపాటు రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది.
దానిమ్మను రోజూ తినడం వల్ల కేన్సర్‌ కారక కణాలను నిర్మూలిస్తుందని మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధనల్లో తేల్చారు. దానిమ్మ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయట. షుగర్‌ పేషెంట్లు దానిమ్మ జ్యూస్‌ తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ కంట్రోల్ లో ఉంటుందని జర్నల్‌ న్యూట్రిషియన్‌ రీసెర్చ్‌ సర్వే వెల్లడించింది.

First Published:  2 Nov 2015 9:33 AM GMT
Next Story