Telugu Global
Others

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ… ఆన్‌లైన్‌లో కూడా…  హైదరాబాద్ నగర వాసులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్ఆర్ఎస్), బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (బీఆర్ఎస్ )కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 28ని కటాఫ్ డేట్గా నిర్ణయించింది. అక్టోబర్ 28 నుంచి రెండు నెలల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పది వేల రూపాయలు చెల్లించి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని […]

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌
X

ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ… ఆన్‌లైన్‌లో కూడా…

హైదరాబాద్ నగర వాసులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్ఆర్ఎస్), బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (బీఆర్ఎస్ )కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 28ని కటాఫ్ డేట్గా నిర్ణయించింది. అక్టోబర్ 28 నుంచి రెండు నెలల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పది వేల రూపాయలు చెల్లించి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రభుత్వం బీఆర్ఎస్ క్రమబద్ధీకరణ చార్జీలను నాలుగు రకాలుగా విభజించి నిర్ణయించింది. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఫ్లాట్కు కనీస ఛార్జీ 12,500 రూపాయలు, 601 నుంచి 1200 చ.అ విస్తీర్ణంలోపు ఫ్లాట్కు రూ. 25 వేలు, 1201 నుంచి 2000 చ.అ విస్తీర్ణంలోపు ఫ్లాట్కు 40 వేలు, 2000 చ.అ. పైన విస్తీర్ణం గల ఫ్లాట్కు 60 వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించింది. అయితే గృహ అవసరాలు, వాణిజ్య సముదాయాలకు ఛార్జీలు వేర్వేరు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే ఎల్ఆర్ఎస్ చార్జీలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 100 లోపు చదరపు మీటర్ల ప్లాట్‌కు ప్రతి చ.మీ.కు రూ.200 చార్జీ, 101-200 చదరపు మీటర్ల ప్లాట్‌కు ప్రతి చ.మీ.కు రూ. 400, 301-500 చదరపు మీటర్ల ప్లాట్‌కు ప్రతి చ.మీ.కు రూ.600, 500 పైన చదరపు మీటర్ల ప్లాట్‌కు ప్రతి చ.మీ.కు రూ.750, మురికివాడల్లో నివసించే వారి స్థలాల క్రమబద్ధీకరణకు ప్రతి చ.మీ.కు 5 రూపాయల చార్జీ వసూలు చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులకు 6 నెలల్లోపు ఆమోదం లభిస్తుందని, భవిష్యత్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

First Published:  2 Nov 2015 9:20 AM GMT
Next Story