Telugu Global
Others

ఇంగువ‌...వంట‌కి రుచి...ఒంటికి ఆరోగ్యం

తాలింపుకి ఇంగువ ఇచ్చే రుచి ఎంతో ప్ర‌త్యేకం. దీని రుచి మిగిలిన ప‌దార్ధాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇంగువ నిజంగా భిన్న‌మే. ఇది వంట‌కి రుచినేకాదు, ఒంటికి లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజనాలు అందిస్తుంది. వాటిని తెలుసుకుంటే ఇంగువ‌ని వాడ‌కుండా ఉండ‌లేము. ఆ వివ‌రాలు- అధిక ర‌క్త‌పోటుకి అడ్డుక‌ట్ట‌ ఇంగువ‌లో ఉన్న గుణాలు ర‌క్తాన్ని గడ్డ‌క‌ట్ట‌కుండా చేస్తాయి. శ‌రీరంలో కొలెస్ట్రాల్‌ని, ర‌క్తంలో కొవ్వు స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అలా అధిక ర‌క్త‌పోటుని, హైప‌ర్ టెన్ష‌న్‌ని ద‌రిచేర‌కుండా ఇంగువ కాపాడుతుంది. అజీర్తి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి శ‌రీరంలో అనారోగ్యాల‌ను క‌లిగించే ఫ్రీ […]

ఇంగువ‌...వంట‌కి రుచి...ఒంటికి ఆరోగ్యం
X

తాలింపుకి ఇంగువ ఇచ్చే రుచి ఎంతో ప్ర‌త్యేకం. దీని రుచి మిగిలిన ప‌దార్ధాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇంగువ నిజంగా భిన్న‌మే. ఇది వంట‌కి రుచినేకాదు, ఒంటికి లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజనాలు అందిస్తుంది. వాటిని తెలుసుకుంటే ఇంగువ‌ని వాడ‌కుండా ఉండ‌లేము. ఆ వివ‌రాలు-

అధిక ర‌క్త‌పోటుకి అడ్డుక‌ట్ట‌
ఇంగువ‌లో ఉన్న గుణాలు ర‌క్తాన్ని గడ్డ‌క‌ట్ట‌కుండా చేస్తాయి. శ‌రీరంలో కొలెస్ట్రాల్‌ని, ర‌క్తంలో కొవ్వు స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అలా అధిక ర‌క్త‌పోటుని, హైప‌ర్ టెన్ష‌న్‌ని ద‌రిచేర‌కుండా ఇంగువ కాపాడుతుంది.

అజీర్తి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి
శ‌రీరంలో అనారోగ్యాల‌ను క‌లిగించే ఫ్రీ రాడిక‌ల్స్‌ని నియంత్రించే యాంటీ ఆక్సిడెంటుగా, వాపుని త‌గ్గించే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీగా ప‌నిచేస్తుంది. పేగుల్లో గ్యాస్, పురుగులు, ఇరిట‌బుల్ బౌవెల్ సిండ్రోమ్‌, జీర్ణ‌సంబంధ స‌మ‌స్యల‌ను నివారిస్తుంది. మ‌ల‌బ‌ద్ధ‌కానికి అద్భుత ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. త‌లనొప్పులు త‌గ్గిస్తుంది త‌ల నొప్పుల‌ను ఇంగువ స‌మ‌ర్ధ‌వంతంగా త‌గ్గిస్తుంది. చిటికెడు ఇంగువ‌ని నీళ్ల‌లో క‌లిపి తాగితే నొ ప్పికి చ‌క్క‌ని ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, ఒక చిన్న ఇంగువ ముక్క‌ని నిమ్మ‌ర‌సంలో నాన‌బెడితే ఆ మిశ్ర‌మం పంటినొప్పికి మందుగా అద్భుతంగా ప‌నిచేస్తుంది.

ఊపిరితిత్తుల‌కు ఊపిరి పోస్తుంది
ఆస్త‌మా, పొడిద‌గ్గు, ఛాతీ ప‌ట్టేయ‌డం, ఛాతీలో ఫ్ల‌మ్ చేర‌డం ఇంకా ప‌లుర‌కాల ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌కు ఇంగువ మంచిమందు. ఇది ప‌లు శ్వాస స‌మ‌స్య‌ల‌ను, ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తుంది. కాస్త ఇంగువ‌ని తేనె, అల్లంల‌తో క‌లి పి వాడుకోవాలి.

న‌రాల‌ జ‌బ్బులు త‌గ్గించే వ‌రం
ఇంగువ‌లో న‌రాల స‌మ‌స్య‌లు త‌గ్గించే శ‌క్తి ఉంది. హిస్టీరియా, ప‌లుర‌కాల మూర్ఛ‌ల‌కు ఇంగువ మందులా ప‌నిచేస్తుంది.

రుతుక్ర‌మ స‌మ‌స్య‌ల‌కు చెక్‌
ఇంగువ‌ని ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల‌న మ‌హిళ‌లు ఎదుర్కొనే రుతుక్ర‌మ స‌మ‌స్య‌లు, నొప్పులు, అప‌స‌వ్య పీరియ‌డ్స్‌‌తో పాటు ప‌లుర‌కాల వెజీనా ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి.

క్యాన్స‌ర్‌ని నివారిస్తుంది
శ‌రీరానికి హానిచేసే ఫ్రీ రాడిక‌ల్ప్‌మీద, యాంటీ ఆక్సిండెంటు రూపంతో పోరాటం చేసి క‌ణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాన్స‌ర్ రాకుండా నివారిస్తుంది.

మ‌ధుమేహానికి ఔష‌ధం
ప్యాంక్రియాస్‌లో హెచ్చుమోతాదులో ఇన్సులిన్ ఉత్ప‌త్తి అయ్యేందుకు ఇంగువ తోడ్ప‌డుతుంది. ఆ విధంగా ఇంగువ ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ని త‌గ్గించ‌గ‌లుగుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు…

చ‌ర్మ సంర‌క్ష‌ణ‌, చ‌ర్మ‌వ్యాధుల నివార‌ణ‌లో
డెర్మ‌టాల‌జిస్టులు సైతం ఇంగువ‌ని వాడుతున్నారు. పాదాల‌ల్లో ఆనెలు, కురుపుల వంటి స‌మ‌స్య‌ల‌కు ఇంగువ‌ని నేరుగా వాడ‌వ‌చ్చు.

స్వైన్ ఫ్లూకి విరుగుడుగా
మ‌న‌ల్ని వ‌ణిస్తున్న స్వైన్‌ఫ్లూకి ఇంగువ అద్భుత ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. ఇంగువ మొక్క వేర్ల‌లో యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. స్వైన్‌ఫ్లూ వైర‌స్ హెచ్‌1 ఎన్‌1ని చంపే సామ‌ర్ధ్యం ఇంగువ‌లో ఉంది. దీన్ని ఈ వ్యాధి నివార‌ణ మందు త‌యారీలో వినియోగించే అవ‌కాశం ఉంది.

First Published:  1 Nov 2015 7:02 PM GMT
Next Story