Telugu Global
CRIME

నేపాల్‌ సేన కాల్పుల్లో భారతీయుడి దుర్మరణం

భారత్-నేపాల్ సరిహద్దులోని బిర్‌గుంజ్‌ ప్రాంతంలో నేపాల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారతీయుడు చనిపోయాడు. ఏడుగురు గాయపడ్డారు. నేపాల్ కొత్త రాజ్యాంగంలో తమకు హక్కులు కల్పించక పోవడంపై 40 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న మధేశీలు నేడు కూడా నిరసన కొనసాగించారు. బిర్‌గుంజ్ ప్రాంతంలో భారత్-నేపాల్‌ను కలిపే వంతెన పైనుంచి ట్రక్కులు పోకుండా అడ్డుకున్నారు. నేపాల్‌కు నిత్యావసరాలు పోకుండా అడ్డుకున్నారు. దీంతో నేపాల్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో భారతీయ యువకుడు మరణించాడు. కాగా […]

నేపాల్‌ సేన కాల్పుల్లో భారతీయుడి దుర్మరణం
X

భారత్-నేపాల్ సరిహద్దులోని బిర్‌గుంజ్‌ ప్రాంతంలో నేపాల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారతీయుడు చనిపోయాడు. ఏడుగురు గాయపడ్డారు. నేపాల్ కొత్త రాజ్యాంగంలో తమకు హక్కులు కల్పించక పోవడంపై 40 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న మధేశీలు నేడు కూడా నిరసన కొనసాగించారు. బిర్‌గుంజ్ ప్రాంతంలో భారత్-నేపాల్‌ను కలిపే వంతెన పైనుంచి ట్రక్కులు పోకుండా అడ్డుకున్నారు. నేపాల్‌కు నిత్యావసరాలు పోకుండా అడ్డుకున్నారు. దీంతో నేపాల్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో భారతీయ యువకుడు మరణించాడు. కాగా భారత్-నేపాల్ సరిహద్దులోని బిర్‌గుంజ్‌ ప్రాంతంలో నేపాల్ బలగాలు జరిపిన కాల్పుల్లో భారతీయుడు చనిపోవడంపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. నేపాల్ ప్రధాని ఓలీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. అటు నేపాల్ రాయబారికి భారత్ సమన్లు పంపింది. ఘటనపై వివరణ కోరనుంది.
పాక్ రేంజర్ల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. గురేజ్ సెక్టార్‌లో కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు చనిపోయారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు మొదలైన కాల్పులు రెండు గంటలదాకా కొనసాగాయి. పాక్ కాల్పులను భారత్ దీటుగా తిప్పికొట్టింది.

First Published:  1 Nov 2015 5:01 PM GMT
Next Story