పుకార్లపై క్లారిటీ ఇచ్చిన కంచె భామ

కంచె సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా విజయంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఆమెపై ఓ పుకారు కూడా షికారు చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తను మాత్రం ఈ బ్యూటీ ఖండించింది. మహేష్ సరసన నటించాలని తనకు కూడా ఉందని చెప్పిన ప్రగ్యా.. ఆ రూమర్లు నిజమైతే బాగుండేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే మహేష్ నుంచి తనకు ఎలాంటి కాల్ రాలేదని స్పష్టంచేసింది. అసలు ఇప్పటివరకు మహేష్ ను తను కలుసుకోలేదని, ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తంచేసింది ప్రగ్యా. ఏదేమైనా అటు కంచె సినిమాతోపాటు, ఇటు పుకారుతో బాగానే పబ్లిసిటీ కొట్టేసింది ఈ భామ.