Telugu Global
Others

'బీఫ్‌ తింటే సీఎం తల నరికేస్తా'

భారతీయ జనతాపార్టీ విధానాలు చూస్తుంటే తనకు కూడా ఆవు మాంసం తినాలనిపిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటనకు అంతే తీవ్ర స్థాయిలో సమాధానమిచ్చారు ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు చెన్న బసప్ప. నిజంగా అలా చేస్తే అవు మాంసం తిన్న మరుక్షణమే సిద్ధరామయ్య తల నరికేస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో తననెవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలు బీజేపీని కవ్వించే విధంగా ఉన్నాయని శివమొగ్గలో ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మి […]

బీఫ్‌ తింటే సీఎం తల నరికేస్తా
X

భారతీయ జనతాపార్టీ విధానాలు చూస్తుంటే తనకు కూడా ఆవు మాంసం తినాలనిపిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటనకు అంతే తీవ్ర స్థాయిలో సమాధానమిచ్చారు ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు చెన్న బసప్ప. నిజంగా అలా చేస్తే అవు మాంసం తిన్న మరుక్షణమే సిద్ధరామయ్య తల నరికేస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో తననెవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలు బీజేపీని కవ్వించే విధంగా ఉన్నాయని శివమొగ్గలో ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మి ఆయనకు సీఎంగా పట్టం కడితే నియంతలా వ్యవహరిస్తూ అందరి ఆశలను ఆడియాశలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే శివమొగ్గలోని గోపీ సర్కిల్‌కు వచ్చి ఆవు మాంసం తినాలని సవాల్‌ విసిరారు. అదే జరిగితే ఆ ప్రాంతంలో సిద్ధరామయ్య తల నరికి చంపుతామని, దీనిపై వెనక్కి తగ్గే అవకాశమే లేదని హెచ్చరించారు. చెన్నబసప్ప చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్‌ నాయకుల్లోను, ఇటు బీజేపీ నాయకుల్లోను ఆందోళన సృష్టించాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ముగిసిన తర్వాత చెన్న బసప్ప వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

First Published:  3 Nov 2015 11:56 AM GMT
Next Story