Telugu Global
NEWS

మరోసారి ఉద్యమాలకు ఊపిరిపోయకండి!

వెనుక బడిన రాయలసీమ, ఉత్తరాంధ్రపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారంటూ ప్రజాసంఘాలు గళమెత్తుతున్న వేళ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఈ అంశంపై కాస్త సూటిగా స్పందించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చంద్రబాబు తీవ్ర అన్యాయంచేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య ఉద్వేగాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వల్లే ఉద్యమాలు ఊపిరిపోసుకున్నాయని… ఇప్పుడు చంద్రబాబు కూడా మరోసారి అదే తప్పు చేస్తున్నారని జగన్ ఆక్షేపించారు. రాజధానికి తాము వ్యతిరేకం […]

మరోసారి ఉద్యమాలకు ఊపిరిపోయకండి!
X

వెనుక బడిన రాయలసీమ, ఉత్తరాంధ్రపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారంటూ ప్రజాసంఘాలు గళమెత్తుతున్న వేళ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఈ అంశంపై కాస్త సూటిగా స్పందించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చంద్రబాబు తీవ్ర అన్యాయంచేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య ఉద్వేగాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వల్లే ఉద్యమాలు ఊపిరిపోసుకున్నాయని… ఇప్పుడు చంద్రబాబు కూడా మరోసారి అదే తప్పు చేస్తున్నారని జగన్ ఆక్షేపించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని అయితే అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరించాలని కోరారు. హైకోర్టును రాజధానిలో కాకుండా మరో జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 854 అడుగుల మేర నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందుతాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేయడం పట్ల రాయలసీమవాసుల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పద్మావతి మెడికల్ కాలేజి సీట్లను రాయలసీమ వారికి దక్కకుండా చేశారన్న భావన జనంలో ఉందని చెప్పారు. కరువుతో అల్లాడుతున్నప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించకపోవడం చంద్రబాబు పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని జగన్ విమర్శించారు.

First Published:  3 Nov 2015 9:37 AM GMT
Next Story