Telugu Global
Others

త్వరలో కేసీఆర్-రేవంత్ భేటీ

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇప్పటికే ఇందుకు అనేక సంఘటనలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ఎప్పుడూ విమర్శలు చేసుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లను అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కలిపింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావులు మోహన్ బాబు కుమారుడి పెళ్లి సందర్భంగా కలుసుకుని ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆతర్వాత జగన్ స్వయంగా రామోజీ ఇంటికి వెళ్లి కలిశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం,  […]

త్వరలో కేసీఆర్-రేవంత్ భేటీ
X

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇప్పటికే ఇందుకు అనేక సంఘటనలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ఎప్పుడూ విమర్శలు చేసుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లను అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కలిపింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావులు మోహన్ బాబు కుమారుడి పెళ్లి సందర్భంగా కలుసుకుని ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆతర్వాత జగన్ స్వయంగా రామోజీ ఇంటికి వెళ్లి కలిశారు.
ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం, తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రసిడెండ్ రేవంత్ రెడ్డి కూడా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును. త్వరలో ఈ ఇద్దరు నాయకులు కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. అది ఓ శుభకార్యం సందర్భంగా. సూటిగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి. రేవంత్ కూతురికి ఇటీవలే గోదావరి జిల్లాకు చెందిన వరుడితో పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఇద్దరికి వివాహం జరగబోతోంది.
తన ఇంట్లో జరిగే పెళ్లికి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాను సీఎం కేసీఆర్ ను ఆహ్వానించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి కూతురు పెళ్లికి రావాలని ఆహ్వానిస్తారని తెలుస్తోంది. రేవంత్ ఆహ్వానించినంత మాత్రాన పెళ్లికి వెళ్తారా? లేదా? అన్నది మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

First Published:  2 Nov 2015 11:06 PM GMT
Next Story