Telugu Global
NEWS

పట్టిసీమ ఆపాలంటున్న అధికార పార్టీ ప్రతినిధులు?

తూర్పు గోదావరి జిల్లాలో రబీకి నీరు ఇవ్వడంపై అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలందరూ ఒక్క మాట మీదకొచ్చారు. కొందరు పట్టిసీమ ప్రాజెక్టు పనులను ఆపాలని, మరికొందరు నిర్వహించాలని డిమాండు చేయడంతో జిల్లా నీటి సంఘాల సమావేశం రసాభాసగా మారింది. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద 32 వేల ఎకరాలకు నీరివ్వాలని ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మలు ఆందోళనకు దిగారు. దీనికి ఇతర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. రబీ సీజన్‌లో పట్టిసీమ ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు వీలు […]

పట్టిసీమ ఆపాలంటున్న అధికార పార్టీ ప్రతినిధులు?
X

తూర్పు గోదావరి జిల్లాలో రబీకి నీరు ఇవ్వడంపై అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలందరూ ఒక్క మాట మీదకొచ్చారు. కొందరు పట్టిసీమ ప్రాజెక్టు పనులను ఆపాలని, మరికొందరు నిర్వహించాలని డిమాండు చేయడంతో జిల్లా నీటి సంఘాల సమావేశం రసాభాసగా మారింది. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద 32 వేల ఎకరాలకు నీరివ్వాలని ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మలు ఆందోళనకు దిగారు. దీనికి ఇతర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. రబీ సీజన్‌లో పట్టిసీమ ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు వీలు లేదని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పట్టుబట్టారు. ఈ ఎత్తిపోతల పనులు చేపడితే తూర్పు గోదావరి జిల్లాకు నీరివ్వడం సాధ్యం కాదని వారు ఆరోపించారు. జిల్లాకు నీరివ్వకుండా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరవ్వడం సరికాదని వారు విమర్శించారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌తో సహా రబీకి వంద శాతం నీరు ఇవ్వాల్సిందేనని సమావేశం నిర్ణయించింది. ఏలేరు కాలువ దిగువనున్న పంట పొలాలకు నీటి విడుదలపై సీఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి చిన రాజప్ప వెల్లడించారు.

First Published:  3 Nov 2015 3:22 AM GMT
Next Story