Telugu Global
CRIME

ఉబర్ క్యాబ్ డ్రైవర్‌కు యావజ్జీవ ఖైదు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 25 ఏళ్ళ యువతిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో శివకుమార్‌ నిందితుడు. గత ఏడాది డిసెంబర్ 5న రాత్రిపూట క్యాబ్ ఎక్కిన ఓ యువతి నిద్రలోకి జారుకున్నప్పుడు నిందితుడు శివకుమార్‌ ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకుపోయాడు. ఆమెను నిద్రలోంచి మేల్కొలిపిన డ్రైవర్‌ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం ఢిల్లీలో […]

ఉబర్ క్యాబ్ డ్రైవర్‌కు యావజ్జీవ ఖైదు
X

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 25 ఏళ్ళ యువతిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో శివకుమార్‌ నిందితుడు. గత ఏడాది డిసెంబర్ 5న రాత్రిపూట క్యాబ్ ఎక్కిన ఓ యువతి నిద్రలోకి జారుకున్నప్పుడు నిందితుడు శివకుమార్‌ ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకుపోయాడు. ఆమెను నిద్రలోంచి మేల్కొలిపిన డ్రైవర్‌ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం ఢిల్లీలో మహిళల భద్రతపై ఆందోళనలు జరిగాయి. ఈ సంఘటన గురించి చెబితే చంపేస్తానని బెదిరించినా ఆమె భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఉబర్ క్యాబ్ సర్వీసులపై భారత్‌లో బ్యాన్ విధించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు డ్రైవర్‌ జరిపిన దారుణాన్ని నిర్భయ ఘటనతో పోల్చింది. దోషులకు కఠిన శిక్ష పడుతుందనే సందేశం సమాజానికి తెలియాలని అభిప్రాయపడింది. నేరం నిర్థారణ అయిన ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ శివకుమార్ యాదవ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది.

First Published:  3 Nov 2015 7:34 AM GMT
Next Story