Telugu Global
CRIME

స్నాచర్ల పట్టివేతకు 55 మెరుపు దళాలు

రాష్ట్రంలో గొలుసు దొంగల పట్టివేతకు 55 మెరుపు దళాలను రంగంలోకి దించారు. ఇతర నేరాల కన్నా గొలుసు దొంగతనాల వల్ల జరుగుతున్న పరిణామాలను పోలీసులను కలవరపెడుతున్నాయి. అందుకే వీటిని ఎలాగైనా అరికట్టాలని భావిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత యేడాది 776 గొలుసు చోరీలు జరిగాయని, ఈ ఏడాది ఇప్పటివరకు 320 గొలుసు చోరీలు జరిగాయని ఆయన చెప్పారు. ఈరెండేళ్ళ మధ్య వ్యవధిలో చోరీలు సంఖ్య తగ్గినా హింస పెరిగిందని, ప్రాణాలు తీసేలా స్నాచర్స్‌ […]

స్నాచర్ల పట్టివేతకు 55 మెరుపు దళాలు
X

రాష్ట్రంలో గొలుసు దొంగల పట్టివేతకు 55 మెరుపు దళాలను రంగంలోకి దించారు. ఇతర నేరాల కన్నా గొలుసు దొంగతనాల వల్ల జరుగుతున్న పరిణామాలను పోలీసులను కలవరపెడుతున్నాయి. అందుకే వీటిని ఎలాగైనా అరికట్టాలని భావిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత యేడాది 776 గొలుసు చోరీలు జరిగాయని, ఈ ఏడాది ఇప్పటివరకు 320 గొలుసు చోరీలు జరిగాయని ఆయన చెప్పారు. ఈరెండేళ్ళ మధ్య వ్యవధిలో చోరీలు సంఖ్య తగ్గినా హింస పెరిగిందని, ప్రాణాలు తీసేలా స్నాచర్స్‌ రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అందుకే 55 మెరుపు దళాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. అదే విధంగా నేరాల అదుపునకు ఐదంచెల ప్రణాళికను అమలు చేస్తామని, యాంటీ చైన్ స్నాచింగ్ బృందాల పనితీరు మెరుగుకు తరచూ శిక్షణ ఇవ్వడంతోపాటు అంతరాష్ట్ర దొంగల ముఠా పట్టివేతకు ఏడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పోలీసు వద్ద నేరస్థుల ఫోటోలు ఉండేలా ప్రత్యేక యాప్‌ను తయారు చేశామని, దీనివల్ల స్థానిక పోలీసుల పనితీరు వేగవంతమవుతుందని అన్నారు. నగరంలోని ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్‌లో జరిగిన కాల్పుల ఘటన మాక్ కాదని… నిజమైనదేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

First Published:  3 Nov 2015 6:01 PM GMT
Next Story