Telugu Global
National

'అసహనం' తగ్గాలంటే బీజేపీ ఓడాలి: కేజ్రీవాల్‌

దేశంలో ‘అసహనం’ తగ్గాలంటే బిహార్‌లో బీజేపీ ఓడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఐదో దశ పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉన్న వేళ కేజ్రీవాల్‌ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. ప్రజలు శాంతి కాముకులని, బీజేపీ లాంటి పార్టీలే ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆయన నేరుగా విమర్శలకు దిగడం ఆ పార్టీని కలవరపరుస్తోంది. నితీష్‌కుమార్‌ను మళ్ళీ సీఎం చేయాలని బీహార్‌ ప్రజలను కోరుతూ ఆయన ట్వీట్‌ చేశారు. ఢిల్లీ వాసులంతా బీహార్‌లో […]

అసహనం తగ్గాలంటే బీజేపీ ఓడాలి: కేజ్రీవాల్‌
X

దేశంలో ‘అసహనం’ తగ్గాలంటే బిహార్‌లో బీజేపీ ఓడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఐదో దశ పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉన్న వేళ కేజ్రీవాల్‌ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. ప్రజలు శాంతి కాముకులని, బీజేపీ లాంటి పార్టీలే ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆయన నేరుగా విమర్శలకు దిగడం ఆ పార్టీని కలవరపరుస్తోంది. నితీష్‌కుమార్‌ను మళ్ళీ సీఎం చేయాలని బీహార్‌ ప్రజలను కోరుతూ ఆయన ట్వీట్‌ చేశారు. ఢిల్లీ వాసులంతా బీహార్‌లో ఉన్న తమ బంధుమిత్రులకు ఫోన్‌ చేసి నితీష్‌కు ఓటు వేయాలని సూచించాలని కేజ్రీవాల్‌ కోరారు. కాగా బిహార్‌ ఐదో దశ ఎన్నికలు జరిగే సీమాంచల్‌ ప్రాంతంలో 57 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. నాలుగు జిల్లాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక శక్తి అవుతారు. ఎన్డీయేను మట్టి కరిపించాలంటే నాలుగు జిల్లాల్లో 24 స్థానాలు గెలవాలని మహా కూటమి భావిస్తోంది. గురువారం ఆఖరి దశ పోలింగ్‌ జరుగుతున్న తరుణంలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
లాలూ, నితీశ్‌, కాంగ్రెస్‌ నేతలు సుడిగాలి పర్యటన జరిపారు. ఇండియా తరఫున ప్రధాని మోదీ పూర్ణియా, కతిహార్‌, హార్నియాలో జరిగిన మూడు బహిరంగ సభల్లో ప్రసంగించారు. సీమాంచల్‌ ప్రాంతంలో పార్టీకి 10 స్థానాలు దక్కుతాయని, ఎన్డీయేకు 40 స్థానాలు దాటతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. సీమాంచల్‌ ప్రాంతంలో శరద్‌పవర్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, అసదుద్దీన్‌ నేతృత్వంలోని ఎంఐఎం కీలక పార్టీలుగా మారుతున్నాయి. తమవల్ల ప్రధాన పార్టీలకు ఇబ్బందులు తప్పవని ఇరుపార్టీలు చెబుతున్నాయి. సీమాంచల్‌ ముస్లిం యువకుల్లో ఎంఐఎం ప్రాబల్యం పెరుగుతోంది. 20 రోజులుగా కిషన్‌గంజ్‌లో ఉంటున్న అసదుద్దీన్‌ ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎంఐఎం ఒక్క సీటులో అయినా గెలుపు సాధించి బీహార్‌లో ఖాతా తెరవాలని ఎంఐఎం భావిస్తోంది.

First Published:  4 Nov 2015 7:54 AM GMT
Next Story