Telugu Global
NEWS

ప్రకాశం జెడ్పీ పీఠం ఈదరకే: జిల్లా కోర్టు తీర్పు

హైకోర్టులోను, సుప్రీంకోర్టులో… చివరకు జిల్లా కోర్టులోను కూడా ప్రకాశం జెడ్పీ పీఠాన్ని ఈదరకే కట్టబెట్టాలన్న తీర్పు వచ్చింది. దీంతో ఆయన 15 నెలలుగా చేస్తున్న న్యాయ పోరాటానికి తెర పడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఈదర హరిబాబు ఎన్నిక సబబేనని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో కథ సుఖాంతమైంది. ఈ విషయాన్ని హరిబాబు తరపు న్యాయవాది పంగులూరి గోవిందయ్య తెలిపారు. 2014 జులై 13వ తేదీన జిల్లా […]

ప్రకాశం జెడ్పీ పీఠం ఈదరకే: జిల్లా కోర్టు తీర్పు
X

హైకోర్టులోను, సుప్రీంకోర్టులో… చివరకు జిల్లా కోర్టులోను కూడా ప్రకాశం జెడ్పీ పీఠాన్ని ఈదరకే కట్టబెట్టాలన్న తీర్పు వచ్చింది. దీంతో ఆయన 15 నెలలుగా చేస్తున్న న్యాయ పోరాటానికి తెర పడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఈదర హరిబాబు ఎన్నిక సబబేనని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో కథ సుఖాంతమైంది. ఈ విషయాన్ని హరిబాబు తరపు న్యాయవాది పంగులూరి గోవిందయ్య తెలిపారు. 2014 జులై 13వ తేదీన జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఈదర హరిబాబు విప్‌ ధిక్కరించినందున అతని ఎన్నిక చెల్లదని అప్పటి జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హరిబాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ కలెక్టర్‌ ఉత్తర్వులను రద్దు చేసింది. అయినా హరిబాబుపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ కలెక్టర్‌ అతనికి ఛైర్మన్‌ స్థానాన్ని అప్పగించలేదు. ఫలితంగా హరిబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ హరిబాబుకు అనుకూలంగా తీర్పొచ్చింది. ఈ విషయం జిల్లా కోర్టులో విచారణలో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని కూడా సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో సలహా ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కోర్టు తన తీర్పును వెలువరిస్తూ టిడిపి నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.

First Published:  4 Nov 2015 12:47 PM GMT
Next Story