Telugu Global
CRIME

సారిక విషాదంలో వెలుగులోకి కొత్త అంశాలు

కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, తన ముగ్గురు పిల్లలతో పాటు సజీవదహనం అవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్ వల్లే మంటలు చెలరేగి సారిక, ఆమె ముగ్గురు పిల్లలు చనిపోయారని పోలీసులు ఒక నిర్దారణకు వచ్చారు. అయితే ఈ మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై మాత్రం నిర్ధారణకు రాలేకపోతున్నారు. సారిక నిద్రించిన బెడ్‌రూమ్‌లో గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వంటరూమ్‌లో ఉండాల్సిన సిలిండర్ బెడ్ రూములోకి ఎలా వచ్చాయన్న దానిపై […]

సారిక విషాదంలో వెలుగులోకి కొత్త అంశాలు
X

కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, తన ముగ్గురు పిల్లలతో పాటు సజీవదహనం అవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్ వల్లే మంటలు చెలరేగి సారిక, ఆమె ముగ్గురు పిల్లలు చనిపోయారని పోలీసులు ఒక నిర్దారణకు వచ్చారు. అయితే ఈ మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై మాత్రం నిర్ధారణకు రాలేకపోతున్నారు. సారిక నిద్రించిన బెడ్‌రూమ్‌లో గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వంటరూమ్‌లో ఉండాల్సిన సిలిండర్ బెడ్ రూములోకి ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమే సిలిండర్ తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా ఆపని చేశారా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. రాజయ్యకు వరంగల్ లోక్ సభ టికెట్ ఇవ్వొద్దంటూ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్‌కు సారిక లేఖ కూడా రాసిందని చెబుతున్నారు.

బెడ్ రూమ్‌లో నలుగురు మృతదేహాలు ఒకే చోట పడి ఉన్నాయి. గుర్తుపట్టలేని విధంగా ముద్దగా మారిపోయాయి. ఈ ఘటన జరిగిన సమయంలో రాజయ్య, సారిక భర్త అనిల్ కూడా అదే ఇంటిలో ఉన్నారు. కోడలితో గొడవలు కారణంగా ఇటీవల రాజయ్య వేరో ఇంటిలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఘటన జరిగిన ఇంటి నుంచి వెళ్లి నామినేషన్ వేస్తే విజయం ఖాయమన్న సెంటిమెంట్ తొలినుంచి రాజయ్యకు ఉందని చెబుతున్నారు. అందుకే రెండు రోజుల క్రితం రాజయ్య ఈ ఇంటికి వచ్చారు.

బుధవారం నామినేషన్ కార్యక్రమం ఎలా ఉండాలన్న దానిపై రాత్రి ఒంటిగంట వరకు పార్టీ కార్యకర్తలతో రాజయ్య చర్చలు జరిపారు. అనంతరం రెండో అంతస్తులోని గదికి వెళ్లిపోయారు. అనిల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రించాడు. మూడు గంటల సమయంలో సారిక, చిన్నారులు అగ్నికి ఆహుతైనట్టు భావిస్తున్నారు. సారిక మరణంపై ఆమె తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ అమ్మాయి ఆత్మహత్యచేసుకునేంతంటి పిరికిది కాదని… అత్తింటివారే హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

ఇంజనీరింగ్ కాలేజ్‌లో క్లాస్‌మేట్స్ అయిన అనిల్, సారికలు 2002లో ఆర్యసమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం యూఎస్ వెళ్లిపోయారు. అక్కడ సారిక ఉద్యోగం చేస్తుంటే అనిల్ జల్సాలు చేసేవారని తెలుస్తోంది. దీంతో తిరిగి ఇండియా వచ్చేశారు. అయినా వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అనిల్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. దీని వల్ల వీరి మధ్య గొడవలు మరింత అధికమయ్యాయి. దీంతో రాజయ్య కుటుంబసభ్యులపై ఆమె 498 కేసు పెట్టారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. తనకు న్యాయం జరగాలంటూ గతంలో రాజయ్య ఇంటి ముందు సారిక బైఠాయించారు.

First Published:  3 Nov 2015 11:24 PM GMT
Next Story