Telugu Global
NEWS

ఫోర్బ్స్‌ ... టాప్‌ టెన్‌లో మోదీ, నెంబర్‌ ఒన్‌ పుతిన్‌

పోర్బ్స్‌ మ్యాగజైన్‌ 2015 శక్తిమంతుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు తొలి రెండు స్థానాల్లో లేకపోవడం ఇదే తొలిసారి. అగ్ర రాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా… ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ఇది ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. వరుసగా మూడో సారి ఆయన […]

ఫోర్బ్స్‌ ... టాప్‌ టెన్‌లో మోదీ, నెంబర్‌ ఒన్‌ పుతిన్‌
X

పోర్బ్స్‌ మ్యాగజైన్‌ 2015 శక్తిమంతుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు తొలి రెండు స్థానాల్లో లేకపోవడం ఇదే తొలిసారి. అగ్ర రాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా… ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ఇది ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. వరుసగా మూడో సారి ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉన్నారు. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మూడో స్థానంలో చోటు సంపాదించుకున్నారు. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు లేకపోవడం పోర్బ్స్‌ మ్యాగజైన్‌ చరిత్రలో ఇదే తొలిసారి. నాలుగో స్థానంలో పోప్ ప్రాన్సిస్, ఐదో స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉన్నారు. ఇంతకుముందు 15వ స్థానంలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచారు.

First Published:  4 Nov 2015 11:56 AM GMT
Next Story