Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య బర్త్ డే గిఫ్ట్ అదే

ఈనెలలో నాగచైతన్య పుట్టినరోజు ఉంది. ఆ రోజున అభిమానుల కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు నాగచైతన్య. తన కొత్త సినిమా సాహసం శ్వాసగా సాగిపోకు సంబంధించి సరికొత్త ట్రయిలర్ విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ విడుదలైంది. అక్కినేని జయంతి సందర్భంగా సాహసం శ్వాసగా సాగిపో సినిమా టీజర్ ను విడుదల చేశారు. గౌతమ్ మీనన్ మార్క్ కనిపించింది అందులో. లవ్ ఫీల్ కలిగేలా టీజర్ కట్ చేశారు. ఈసారి […]

నాగచైతన్య బర్త్ డే గిఫ్ట్ అదే
X
ఈనెలలో నాగచైతన్య పుట్టినరోజు ఉంది. ఆ రోజున అభిమానుల కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు నాగచైతన్య. తన కొత్త సినిమా సాహసం శ్వాసగా సాగిపోకు సంబంధించి సరికొత్త ట్రయిలర్ విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ విడుదలైంది. అక్కినేని జయంతి సందర్భంగా సాహసం శ్వాసగా సాగిపో సినిమా టీజర్ ను విడుదల చేశారు. గౌతమ్ మీనన్ మార్క్ కనిపించింది అందులో. లవ్ ఫీల్ కలిగేలా టీజర్ కట్ చేశారు. ఈసారి యాక్షన్ ఎపిసోడ్ ను చూపిస్తూ.. చైతూ బర్త్ డే కానుకగా టీజర్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే కన్ ఫర్మ్ చేశారు. మరోవైపు ఈ సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. కానీ ఆడియో రిలీజ్ తో పాటు, సినిమా విడుదల తేదీల్ని ఇంకా ప్రకటించలేదు. సినిమాను మొదట దీపావళి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు మరో తేదీ కోసం వెదుకుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. మూవీకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు.
First Published:  3 Nov 2015 7:03 PM GMT
Next Story