Telugu Global
National

నెట్ లో విరాట్-అనుష్క పెళ్లి కార్డు

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల పెళ్లి కార్డు నెట్ లో లీకైంది. నిన్నంతా ఫేస్ బుక్ లో ఈ పెళ్లిపత్రికే హల్ చల్ చేసింది. లక్షల లైకులు, వేల రీట్వీట్లు వచ్చాయి ఈ వెడ్డింగ్ కార్డుకి. అయితే పెళ్లిపై వస్తున్న వార్తల్ని ఎప్పటికప్పుడు ఆ జంట ఖండిస్తున్న వేళ,.. ఇలా ఏకంగా పెళ్లి కార్డే నెట్ లోకి రావడం సంచలనం అయింది. అసలు ఆ శుభలేఖ.. విరాట్-అనుష్కలదేనా లేక ఎవరైనా కావాలని […]

నెట్ లో విరాట్-అనుష్క పెళ్లి కార్డు
X
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల పెళ్లి కార్డు నెట్ లో లీకైంది. నిన్నంతా ఫేస్ బుక్ లో ఈ పెళ్లిపత్రికే హల్ చల్ చేసింది. లక్షల లైకులు, వేల రీట్వీట్లు వచ్చాయి ఈ వెడ్డింగ్ కార్డుకి. అయితే పెళ్లిపై వస్తున్న వార్తల్ని ఎప్పటికప్పుడు ఆ జంట ఖండిస్తున్న వేళ,.. ఇలా ఏకంగా పెళ్లి కార్డే నెట్ లోకి రావడం సంచలనం అయింది. అసలు ఆ శుభలేఖ.. విరాట్-అనుష్కలదేనా లేక ఎవరైనా కావాలని పుట్టించారా అనే సందేహాలు బయల్దేరాయి.
నెట్ లో దొరికిన పెళ్లి కార్డు ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 23న విరాట్-అనుష్క ల పెళ్లి ఉంటుందని ఉంది. ఇక రిసెప్షన్ ను ముంబయిలోని తాజ్ హోటల్స్ లో నిర్వహిస్తారని రాసుంది. అయితే శుభలేఖలో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లి తల్లిదండ్రులు సరోజ్ కోహ్లి-ప్రేమ్ కోహ్లి. కాని కార్డులో మాత్రం సురభి, అరుణ్ కోహ్లి అని రాసుంది. అటు అనుష్క తల్లిదండ్రుల పేర్లను కూడా అలాగే తప్పుగా ముద్రించారు. దీంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఈ పెళ్లి కార్డుపై స్పందించడానికి విరాట్, అనుష్క అందుబాటులో లేరు.
First Published:  3 Nov 2015 10:37 PM GMT
Next Story