Telugu Global
Others

టీఆర్ ఎస్‌కు బంప‌ర్ మెజారిటీ సాధ్య‌మేనా..?

వ‌రంగ‌ల్ ఉప‌-ఎన్నిక లో విజ‌యంపై ధీమాగా వున్న టీఆర్ ఎస్ భారీ మెజారిటీపై క‌న్నేసింది. ప్ర‌జ‌ల్లో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఉన్నంత ఆద‌ర‌ణ‌కు ఏ ఉప ఎన్నిక‌కు ఉండ‌ద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే! గ‌త ఎన్నిక కంటే భారీ మెజారిటీ రావాల‌ని మంత్రులు కేడ‌ర్‌కు సూచిస్తున్నారు. ఈ విష‌యంలో మంత్రులు, పార్టీవ‌ర్గాలు ఎంత‌మేర‌కు స‌ఫ‌లీకృత‌మ‌వుతార‌న్న‌ది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌!  2014 ఎన్నిక‌ల్లో క‌డియం శ్రీ‌హ‌రి( టీఆర్ ఎస్) కి  6,61,639 ల‌క్ష‌ల ఓట్లతో మొద‌టిస్థానంలో నిలిచారు. సిరిసిల్ల‌ రాజ‌య్య […]

టీఆర్ ఎస్‌కు బంప‌ర్ మెజారిటీ సాధ్య‌మేనా..?
X
వ‌రంగ‌ల్ ఉప‌-ఎన్నిక లో విజ‌యంపై ధీమాగా వున్న టీఆర్ ఎస్ భారీ మెజారిటీపై క‌న్నేసింది. ప్ర‌జ‌ల్లో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఉన్నంత ఆద‌ర‌ణ‌కు ఏ ఉప ఎన్నిక‌కు ఉండ‌ద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే! గ‌త ఎన్నిక కంటే భారీ మెజారిటీ రావాల‌ని మంత్రులు కేడ‌ర్‌కు సూచిస్తున్నారు. ఈ విష‌యంలో మంత్రులు, పార్టీవ‌ర్గాలు ఎంత‌మేర‌కు స‌ఫ‌లీకృత‌మ‌వుతార‌న్న‌ది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌!
2014 ఎన్నిక‌ల్లో క‌డియం శ్రీ‌హ‌రి( టీఆర్ ఎస్) కి 6,61,639 ల‌క్ష‌ల ఓట్లతో మొద‌టిస్థానంలో నిలిచారు. సిరిసిల్ల‌ రాజ‌య్య (కాంగ్రెస్) 2,69,065, ప‌ర‌మేశ్వ‌ర్ రామ‌గ‌ల్ల (బీజేపీ) 1,87,139 త‌రువాత స్థానాల్లో నిలిచారు. ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం ఏంటంటే.. వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు సెగ్మెంట్ ప‌రిధిలో మొత్తం 7 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్‌లో పాల్గొన్న వారి సంఖ్య 11,60,627 ల‌క్ష‌లు. ఇండిపెండెట్లు, బీఎస్సీ, ఆప్‌, త‌దిత‌ర చిన్నాచిత‌కాపార్టీలతోపాటు టీడీపీ, కాంగ్రెస్‌ల అంద‌రి ఓట్లు క‌లిసినా 4,98,458 ల‌క్ష‌లు మాత్ర‌మే! అంటే.. క‌డియంకు ప‌డ్డ ఓట్ల‌లో ప్ర‌త్య‌ర్థులెవ‌రూ స‌మీప దూరంలో నిలవ‌లేక‌పోయారు. చాలామందికి డిపాజిట్లు గ‌ల్లంతయ్యాయి.
పున‌రావృత‌మ‌వుతుందా?
ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌లే టీఆర్ ఎస్ త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు కుట్ర‌ప‌న్నారంటూ.. ఓటుకు నోటు కేసును మ‌రోసారి బ‌య‌టికి తీయ‌నుంది. దీంతో ఒక్క‌దెబ్బ‌కు ఇటు బీజేపీ- అటు టీడీపీల‌ను ఉక్కిరిబిక్కిరి చేసే ఆయుధం త‌న అమ్ముల‌పొదిలో భ‌ద్రంగా ఉంచుకుంది. 2014లో తెలంగాణ రాష్ర్టాన్ని పోరాడి సాధించార‌న్న సెంటిమెంట్‌తో ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ను కాద‌ని టీఆర్ ఎస్ కు ప‌ట్టం క‌ట్టారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితులు లేవు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు సెగ్మెంట్ ప‌రిధిలో మొత్తం 7 నియోజ‌క‌వ‌ర్గాల ఓట‌ర్ల‌లో మెజారిటీ ప్ర‌జ‌లు యువ‌త‌, ఉద్యోగులు. వీరిలో ఎక్కువ మంది రాజ‌ధానిలో ఉంటున్నారు. ఇప్పుడు వీరంతా ఉప- ఎన్నిక రోజు వ‌రంగ‌ల్ వెళ్లి ఓటు వేస్తారా? అన్న‌ది అనుమాన‌మే! అందుకే ఈ ఎన్నిక త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరుకు కొల‌మాన‌మ‌ని మంత్రి కేటీఆర్ చెబుతున్నా.. ప్ర‌జ‌లు 2014 స్థాయిలో మెజారిటీ క‌ట్ట‌బెడ‌తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
First Published:  4 Nov 2015 4:39 AM GMT
Next Story