Telugu Global
International

ఆయన వయస్సు 23... పాదం పొడవు 21..!

బ్రిటన్‌కు చెందిన కార్ల్‌ గ్రిఫిత్‌… వయస్సు 23. పొడవు 6.8 అడుగులు. ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలే. కానీ ఎవరూ ఊహించని విషయం ఒకటి ఉంది ఈయన ఫీచర్లలో. అదేమిటంటే ఆయన పాదం. ఈ పాదానికి ఇంతవరకు ఏ కంపెనీ కూడా షూ తయారు చేసి ఉండదు. ఎందుకంటే ఆయన పాదం సైజు అటువంటిది. ఇంతకీ సైజు ఎంతనుకుంటున్నారా? 21… మీరు చదివింది నిజమే. ఆయన పాదం సైజు 21. కాబట్టే ఇంతవరకు ఆయన షూ వేసుకునే […]

ఆయన వయస్సు 23... పాదం పొడవు 21..!
X

బ్రిటన్‌కు చెందిన కార్ల్‌ గ్రిఫిత్‌… వయస్సు 23. పొడవు 6.8 అడుగులు. ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలే. కానీ ఎవరూ ఊహించని విషయం ఒకటి ఉంది ఈయన ఫీచర్లలో. అదేమిటంటే ఆయన పాదం. ఈ పాదానికి ఇంతవరకు ఏ కంపెనీ కూడా షూ తయారు చేసి ఉండదు. ఎందుకంటే ఆయన పాదం సైజు అటువంటిది. ఇంతకీ సైజు ఎంతనుకుంటున్నారా? 21… మీరు చదివింది నిజమే. ఆయన పాదం సైజు 21. కాబట్టే ఇంతవరకు ఆయన షూ వేసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆశ కూడా పడలేదు. అయితే ఈ మధ్య ఆయన వేర్‌హౌస్‌ మెన్‌గా శిక్షణ పొందాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ఆయనకు షూ ఇవ్వాల్సి ఉంటుంది. తీరా ఆయన పాదాన్ని పరిశీలించి సదరు కంపెనీ వాళ్ళు నోరెళ్ళబెట్టారు. అతనికి షూ ఇవ్వాలంటే ప్రత్యేకంగా తయారు చేయించాల్సిందే. దానికి రూ. 60 వేల ఖర్చవుతుందని తెలుసుకుని ఉద్యోగాన్ని నిరాకరించారు. అందుకే గ్రిఫిత్‌ కూడా ఎప్పుడూ షూ వేసుకోవాలన్న ఆశ పడలేదు. అతని ఇబ్బందిని గమనించిన మిత్రులు కొంతమంది ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి వారికి విన్నపం చేశారు. ఆ సంస్థ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి షూ కొనివ్వడానికి ముందుకొచ్చింది. దీంతో గ్రిఫిత్‌ ఆనందానికి అవధుల్లేవు. దానికి తడినట్టే ఆయనకు షూ వచ్చింది… దాంతోపాటే ఉద్యోగమూ వచ్చింది. కార్ల్‌ గ్రిఫిత్‌కు డబుల్‌ ధమాకా అన్నమాట! ఇపుడు తన కాలికి వచ్చిన షూ చూసుకుని మురిసిపోతున్నాడు గ్రిఫిత్‌!

First Published:  5 Nov 2015 1:00 AM GMT
Next Story