Telugu Global
NEWS

ఓట్ల తొలగింపుపై టీడీపీ, బీజేపీ నిరసన, ధర్నా

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అక్రమంగా ఓట్ల తొలగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ కనుసన్నలలో అక్రమంగా ఆరు లక్షల ఓట్లను తొలగించడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పిదానికి పాల్పడిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు. ఓట్లను తొలగించడం, తమకు అనుకూలంగా వార్డులను విభజించడం జరిగిందని, మళ్ళీ వార్డుల విభజన చేయాలని, తొలగించిన ఓట్లను యధాతదంగా ఉంచాలని డిమాండు చేస్తూ ఈరెండు పార్టీలూ […]

ఓట్ల తొలగింపుపై టీడీపీ, బీజేపీ నిరసన, ధర్నా
X

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అక్రమంగా ఓట్ల తొలగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ కనుసన్నలలో అక్రమంగా ఆరు లక్షల ఓట్లను తొలగించడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పిదానికి పాల్పడిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు. ఓట్లను తొలగించడం, తమకు అనుకూలంగా వార్డులను విభజించడం జరిగిందని, మళ్ళీ వార్డుల విభజన చేయాలని, తొలగించిన ఓట్లను యధాతదంగా ఉంచాలని డిమాండు చేస్తూ ఈరెండు పార్టీలూ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముదు ధర్నాకు దిగాయి. వందలాది మంది ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ధర్నాకు దిగడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ సందర్భంగా టీటీడీపీ నాయకుడు మాగంటి గోపీనాథ్‌ కాలికి తీవ్ర గాయమైంది. బీజేపీ గ్రేటర్‌ అధ్యక్షుడు వెంకటరెడ్డి, టీడీపీ నాయకుడు ఎం.ఎస్‌. శ్రీనివాస్‌లతో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

First Published:  5 Nov 2015 1:46 AM GMT
Next Story