Telugu Global
Others

నాలుగు గోల్డ్‌ డిపాజిట్‌ స్కీంలకు ప్రధాని శ్రీకారం

నాలుగు బంగారం డిపాజిట్ల పథకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. గోల్డ్‌ మొనిటైజేషన్‌ స్కీం (జీఎంఎస్‌), గోల్డ్‌ సావరిన్‌ బాండ్‌ స్కీం, గోల్డ్‌ కాయిన్‌, గోల్డ్‌ బులియన్‌ స్కీంల పేరుతో నాలుగు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దంతెరస్‌ను పురస్కరించుకుని గోల్డ్‌ కాయిన్‌ అమ్మకం పథకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఐదు, పది, 20 గ్రాముల బరువుతో ఉండే కాయిన్‌లను విడుదల చేస్తున్నామని, తర్వాత కాలంలో వివిధ రకాల బరువులతో మరిన్ని కాయిన్లను విడుదల చేస్తామని మోదీ తెలిపారు. ఈ […]

నాలుగు గోల్డ్‌ డిపాజిట్‌ స్కీంలకు ప్రధాని శ్రీకారం
X

నాలుగు బంగారం డిపాజిట్ల పథకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. గోల్డ్‌ మొనిటైజేషన్‌ స్కీం (జీఎంఎస్‌), గోల్డ్‌ సావరిన్‌ బాండ్‌ స్కీం, గోల్డ్‌ కాయిన్‌, గోల్డ్‌ బులియన్‌ స్కీంల పేరుతో నాలుగు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దంతెరస్‌ను పురస్కరించుకుని గోల్డ్‌ కాయిన్‌ అమ్మకం పథకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఐదు, పది, 20 గ్రాముల బరువుతో ఉండే కాయిన్‌లను విడుదల చేస్తున్నామని, తర్వాత కాలంలో వివిధ రకాల బరువులతో మరిన్ని కాయిన్లను విడుదల చేస్తామని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇరవై వేల టన్నుల బంగారం నిల్వలున్న భారత్‌ పేద దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిరుపయోగంగా ఉన్న బంగారం నిల్వలు వెలికి తీసి దానికున్న డిమాండ్‌ను తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహిళల పేరుతో ఆస్తులు లేవన్న ఆయన వారికి సాధికారిత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్‌లు కూడా హాజరయ్యారు. యేడాది వ్యవధిగల బంగారం డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ఆయన చెప్పారు. వడ్డీల చెల్లింపుపై తుది నిర్ణయం బ్యాంకులకే వదిలి వేస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.
గోల్డ్‌ కాయిన్‌పై ఒకవైపు అశోక చక్రం, మరోవైపు మహాత్మాగాంధీ రూపాన్ని ముద్రించారు. ముందుగా ఐదు గ్రాముల గోల్డ్‌ కాయిన్లను 15 వేలు, 10 గ్రాములు గోల్డ్‌ కాయిన్లు 20 వేలు, 20 గ్రాములు గోల్డ్‌ కాయిన్లు 3,750 చొప్పున అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం వీటిని ఎంఎంటీసీ కేంద్రాల్లో విక్రయిస్తారని, ఆతర్వాత కాలంలో బ్యాంకుల్లోను, పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో పెడతామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న గోల్డ్‌ కాయిన్లు వినూత్నంగా ఉంటాయని, తొలగించలేని కాయిన్‌ ఫ్రూఫ్‌ ప్యాకేజీ కలిగి ఉంటుందని ఆయన తెలిపారు.

First Published:  5 Nov 2015 2:37 AM GMT
Next Story