Telugu Global
National

భారత్ లోనూ గూగుల్ లూన్ నెట్

ఇంటర్నెట్ యుగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. మొన్నటి వరకు 2జీ అన్నారు. నిన్న 3జీ వచ్చింది. ఇప్పుడు 4జీ నడుస్తోంది. త్వరలో మరో కొత్త విధానం అమల్లోకి రానుంది. గూగుల్ అమలు చేయబోతున్న ఈ విధానం అమలైతే  మరింత స్పీడ్ తో ఇంటర్నెట్ అమల్లోకి రానుంది.  ఇప్పుడు పరిస్థితుల్లో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. సమస్త సమాచారం క్షణాల్లో తెలుసుకునే అవకాశం కల్పింస్తోంది ఇంటర్నెట్. అలాంటి ఇంటర్నెట్ ఇప్పటికే పెద్ద పెద్దనగరాలు, జిల్లా కేంద్రాలు, ఓమోస్తరు పట్టణాలకే […]

భారత్ లోనూ గూగుల్ లూన్ నెట్
X
ఇంటర్నెట్ యుగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. మొన్నటి వరకు 2జీ అన్నారు. నిన్న 3జీ వచ్చింది. ఇప్పుడు 4జీ నడుస్తోంది. త్వరలో మరో కొత్త విధానం అమల్లోకి రానుంది. గూగుల్ అమలు చేయబోతున్న ఈ విధానం అమలైతే మరింత స్పీడ్ తో ఇంటర్నెట్ అమల్లోకి రానుంది.
ఇప్పుడు పరిస్థితుల్లో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. సమస్త సమాచారం క్షణాల్లో తెలుసుకునే అవకాశం కల్పింస్తోంది ఇంటర్నెట్. అలాంటి ఇంటర్నెట్ ఇప్పటికే పెద్ద పెద్దనగరాలు, జిల్లా కేంద్రాలు, ఓమోస్తరు పట్టణాలకే పరిమితం అయింది. ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత పెంచేందుకు గూగుల్ వినూత్న ప్రయోగం చేయబోతోంది.
బెలూన్లలో ఇంటర్నెట్ యాక్సెస్ కు సంబంధించిన పరికరాలను అమరుస్తారు. భూ ఉపరితలంపై 20 కిలోమీటర్ల ఎత్తులో బెలూన్లు ఎగురుతాయి. 40 కిలోమీటర్ల వ్యాసార్థంలో వీటి ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా రోజంతా విద్యుత్తు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అంటే సౌరశక్తే వీటికి ఆధారం. ఈ విధానంలో 4జి ఇంటర్నెట్ యాక్సెస్ గ్యారంటీ అని గూగుల్ చెబుతోంది
ప్రాజెక్టు లూన్ పేరుతో బెలూన్లే సెల్ టవర్లుగా ఉపయోగించి ఇంటర్నెట్ వినియోగించాలన్న గూగుల్ చేస్తున్న ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటికే ఈ తరహా విధానం న్యూజిలాండ్ లో సక్సెస్ అయింది. బ్రెజిల్ లోనూ అమలవుతోంది. శ్రీలంకలో కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ భావిస్తోంది. ఇక ఇండోనేషియా కూడా ఈ లూన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పడు అతిపెద్ద దేశంగా ప్రాజెక్ట్ లూన్ ను అమలు చేయబోతున్న 5వ దేశంగా భారత్ మారబోతోంది.
మనదేశంలో లూన్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ అమలు కోసం గూగుల్ బిఎస్ఎన్ఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్నెట్ బీమింగ్ టెస్టు కోసం 2.6 గిగాహెడ్జ్ బ్యాండ్ ను ఉపయోగిస్తారు. అన్ని ఏర్పాట్లూ జరిగిన తర్వాత త్వరలో మనదేశంలోని గ్రామాలకూ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ విధానం సక్సెస్ అయితే ఇంటర్నెట్ వినియోగంలో మరో మైలురాయి అధికమించినట్టే అంటున్నారు.
First Published:  4 Nov 2015 1:01 PM GMT
Next Story