Telugu Global
National

అక్రమ సంతానానికీ నిందితుడి ఆస్తిలో హక్కు

అత్యాచారం కారణంగా పుట్టిన బిడ్డకు నిందితుడి ఆస్తిపై వారసత్వ హక్కులుంటాయని అలహాబాద్‌ హైకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. ఇలాంటి సమస్య వస్తే మార్గదర్శకత్వం చేసేందుకు వీలుగా ఓ చట్టాన్ని చేయాలని కోర్టు శాసన వ్యవస్థకు సూచించింది. ఇలా పుట్టిన బిడ్డను నిందితుడి అక్రమ సంతానంగా పరిగణించాలని, అతనికున్న ఆస్తులన్నింటిపై బిడ్డకు కూడా వారసత్వ హక్కులుంటాయని స్పష్టం చేసింది. జస్టిస్‌ షబీహుల్‌ హస్నైన్‌, జస్టిస్‌ డీకే ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఒకవేళ అలాంటి బిడ్డను […]

అక్రమ సంతానానికీ నిందితుడి ఆస్తిలో హక్కు
X

అత్యాచారం కారణంగా పుట్టిన బిడ్డకు నిందితుడి ఆస్తిపై వారసత్వ హక్కులుంటాయని అలహాబాద్‌ హైకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. ఇలాంటి సమస్య వస్తే మార్గదర్శకత్వం చేసేందుకు వీలుగా ఓ చట్టాన్ని చేయాలని కోర్టు శాసన వ్యవస్థకు సూచించింది. ఇలా పుట్టిన బిడ్డను నిందితుడి అక్రమ సంతానంగా పరిగణించాలని, అతనికున్న ఆస్తులన్నింటిపై బిడ్డకు కూడా వారసత్వ హక్కులుంటాయని స్పష్టం చేసింది. జస్టిస్‌ షబీహుల్‌ హస్నైన్‌, జస్టిస్‌ డీకే ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఒకవేళ అలాంటి బిడ్డను దత్తత ఇస్తే మాత్రం వారసత్వ హక్కులు ఉండవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అత్యాచార బాధితురాలికి జన్మించిన శిశువు ఓ జంట పరస్పర సమ్మతితో కూడిన లైంగిక చర్యతో పుట్టారా లేదా అనేది అసందర్భమని వెల్లడించింది. నవజాత శిశువుకు వారసత్వ హక్కుల్ని వ్యక్తిగత చట్టం అందజేస్తుందని, అందుకని రక్తం పంచిన తండ్రి అక్రమ సంతానంగా పరిగణించాలని ధర్మాసనం తెలిపింది. ఈ యేడాది ప్రారంభంలో అత్యాచారానికి గురైన ఓ పేద యువతి గర్భం దాల్చి ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ తీర్పును ఇచ్చింది.

First Published:  5 Nov 2015 11:32 AM GMT
Next Story