రాముడు పాక్ లో పుట్టాడా?

ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ అబ్ధుల్‌ రహీమ్‌ ఖురేషి. అయోధ్య వివాదంపై రాసిన ఫ్యాక్ట్స్‌ ఆఫ్‌ ఆయోధ్య అనే పుస్తకం సంచలనం సృష్టిస్తోంది. రాముడు అయోధ్యలో జన్మించలేదని.. ఆయన పాకిస్థాన్ లోని ధేరా అనే ప్రాంతంలో జన్మించాడని అబ్లుద్ రహీమ్ ఖురేషీ అంటున్నారు. రాముడి జన్మస్థానం అయోధ్య కాదనడానికి అన్ని ఆధారాలున్నాయని ఆయన చెబుతున్నారు. 
రాముడు అయోధ్యలో పుట్టలేదు.. పాకిస్థాన్ లోని ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని ధేరా అనే ప్రాంతంలో పుట్టాడని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని రెహమాన్‌ ధేరాగా పిలుస్తున్నారని.. పూర్వం దీన్నే రామ్‌ ధేరాగా పిలిచేవారని ఖురేషి తన పుస్తకంలో రాశారు. ఆర్కియాలజికల్‌ సర్వేఆఫ్‌ ఇండియా నిపుణులు జాసు రాజ్‌ నివేదికలను కూడా ఖరేషి తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ నివేదికలు ఆధారంగా రాముడి తండ్రి దశరథుడు తన సామ్రాజ్యాన్ని పంజాబ్‌, హర్యానాల నుంచి పాకిస్తాన్‌ మీదుగా ఆఫ్ఘనిస్థాన్ వరకు విస్తరించారని చెప్పారు. పంజాబ్‌కు అవతల ప్రాంతంలోనే రాముడు జన్మించాడని.. అది పాకిస్థాన్‌ అయి ఉంటుందని ఆ పుస్తకంలో రాశారు.
అయోధ్య వివాదం కేవలం బ్రిటిష్‌ పాలకులు మనదేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నంగా ఖురేషి అభివర్ణిస్తున్నారు.  మొత్తం మీద రామమందిరం వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న సమయంలో ఇలాంటి వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.