Telugu Global
National

స్టార్టప్స్‌ల కోసం మైక్రోసాఫ్ట్‌ కొత్త ప్రాజెక్టు

స్టార్టప్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ త్వరలో ప్రత్యేక ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఈ సంస్థ సీఈఓ సత్య నాదెండ్ల తెలిపారు. ముంబయిలో జరుగుతున్న ‘మైక్రోసాఫ్ట్‌ ప్యూచర్‌ అన్‌లీష్‌డ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పట్టణ ప్రాంతాల్లో పెరిగి పోతున్న టెక్నాలజీ సమస్యలకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు. వచ్చే యేడాది 50 స్మార్ట్‌ నగరాల్లో 50 స్టార్టప్స్‌లో భాగస్వాములమవుతామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి భాగస్వాములమవుతామని సత్యనాదెండ్ల హామీ ఇచ్చారు. స్టార్టప్స్‌ కంపెనీలను దృష్టిలో పెట్టుకుని క్లౌడ్‌ […]

స్టార్టప్స్‌ల కోసం మైక్రోసాఫ్ట్‌ కొత్త ప్రాజెక్టు
X

స్టార్టప్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ త్వరలో ప్రత్యేక ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఈ సంస్థ సీఈఓ సత్య నాదెండ్ల తెలిపారు. ముంబయిలో జరుగుతున్న ‘మైక్రోసాఫ్ట్‌ ప్యూచర్‌ అన్‌లీష్‌డ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పట్టణ ప్రాంతాల్లో పెరిగి పోతున్న టెక్నాలజీ సమస్యలకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు. వచ్చే యేడాది 50 స్మార్ట్‌ నగరాల్లో 50 స్టార్టప్స్‌లో భాగస్వాములమవుతామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి భాగస్వాములమవుతామని సత్యనాదెండ్ల హామీ ఇచ్చారు. స్టార్టప్స్‌ కంపెనీలను దృష్టిలో పెట్టుకుని క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలిపారు. సర్ఫేస్‌ ప్రో-4 ట్యాబ్లెట్‌ వచ్చే యేడాది జనవరిలో భారత్‌ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ-కామర్స్‌ సంస్థలైన జస్ట్‌ డయల్‌, పేటిఎం, స్నాప్‌డీల్‌లతో భాగస్వాములవుతున్నట్టు సత్య నాదెండ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా భాస్కర్‌ ప్రమాణిక్‌ మాట్లాడుతూ తమ కంపెనీ ఇప్పటికి 42 ప్రభుత్వ సర్వీసులను ఆన్‌లైన్‌ చేసినట్టు తెలిపారు. విండోస్‌-10తో పని చేయనున్న లుమియా 950, లుమియా 950 ఎక్సెల్‌ ఫోన్లను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నామని చెప్పారు.

First Published:  5 Nov 2015 11:59 AM GMT
Next Story