Telugu Global
International

ఇమ్రాన్‌ఖాన్ హత్యకు రెండోభార్య కుట్ర?

పాకిస్థాన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌, రాజకీయ నేత ఇమ్రాన్‌ఖాన్‌ హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. పది నెలల క్రితం పెళ్ళి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ రెండో భార్య రెహమ్‌ ఈ కుట్ర చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. 42 యేళ్ళ రెహమ్‌ బీబీసీ వ్యాఖ్యాత. 62 యేళ్ళ ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ఏడాది జనవరిలో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే పది నెలలకే వారిరువురూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే దీని వెనుక మరో బలమైన కారణముందని […]

ఇమ్రాన్‌ఖాన్ హత్యకు రెండోభార్య కుట్ర?
X

పాకిస్థాన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌, రాజకీయ నేత ఇమ్రాన్‌ఖాన్‌ హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. పది నెలల క్రితం పెళ్ళి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ రెండో భార్య రెహమ్‌ ఈ కుట్ర చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. 42 యేళ్ళ రెహమ్‌ బీబీసీ వ్యాఖ్యాత. 62 యేళ్ళ ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ఏడాది జనవరిలో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే పది నెలలకే వారిరువురూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే దీని వెనుక మరో బలమైన కారణముందని వెలుగులోకి వచ్చింది. 2013లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్‌ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. పార్టీ భవిష్యత్‌ బాగుంటే తనకు మంచి భవిష్యత్‌ ఉంటుందని భావించిన రెహమ్‌ ఇమ్రాన్‌ను వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దురాశ మరింత ఎక్కువై అతన్ని హతమారిస్తే పార్టీ పగ్గాలు పూర్తిగా తనకే వస్తాయని భావించిన ఆమె ఇమ్రాన్‌పై విష ప్రయోగం చేసినట్టు పాక్‌ మీడియా ఆరోపిస్తోంది. ఇమ్రాన్‌ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆయనపై విష ప్రయోగం చేయడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని వైద్యులు నిర్దారించారు. దీని వెనుక రెండో భార్య హస్తముందని ఇమ్రాన్‌ గ్రహించాడు. రెహమ్‌ ప్రవర్తనపైన, ఆమె వ్యవహారశైలి మీద ఇమ్రాన్‌ను నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయని తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే రెహమ్‌కు ఇమ్రాన్‌ను వివాహం చేసుకోవడానికి ముందే ఒక పెళ్ళయినట్టు తెలిసింది. ఈ వ్యవహారాలన్నీ తెలిసిన తర్వాత ఇమ్రాన్‌ ఆమెకు తలాక్‌ చెప్పి ఆమెను వదిలించుకున్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్ళి పెటాకులు కావడానికి వెనుక ఇంత కథ నడిచిందన్న మాట!

First Published:  5 Nov 2015 10:52 AM GMT
Next Story