Telugu Global
Others

ఆ ఇద్ద‌రు పార్టీని ముంచారా?

ఒకాయ‌న కేంద్ర మాజీమంత్రి, మ‌రొకాయ‌న ఏఐసీసీ మెంబ‌ర్‌-మాజీ ఎంపీ ఈ ఇద్ద‌రూ బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వులు అనుభ‌వించి ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. పైగా పార్టీ త్వ‌ర‌లో  పార్ల‌మెంటుకు జ‌రిగే ఉప‌-ఎన్నిక‌లో పాల్గొన‌నుంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో త‌మ చేష్ట‌ల‌తో కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో ప‌డేశారు. వారిలో ఒక‌రు పోరిక బ‌లరాం నాయ‌క్‌ కాగా, మ‌రొక‌రు సిరిసిల్ల రాజ‌య్య. అవును! వీరిద్ద‌రి వ‌ల్ల పార్టీకి అంతులేని న‌ష్టం జ‌రిగింద‌ని సొంత‌పార్టీ నేత‌లు బ‌హిరంగంగానే చెప్పేస్తున్నారు. బ‌ల‌రాం అహంకార వ్యాఖ్య‌లు, రాజ‌య్య […]

ఆ ఇద్ద‌రు పార్టీని ముంచారా?
X
ఒకాయ‌న కేంద్ర మాజీమంత్రి, మ‌రొకాయ‌న ఏఐసీసీ మెంబ‌ర్‌-మాజీ ఎంపీ ఈ ఇద్ద‌రూ బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వులు అనుభ‌వించి ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. పైగా పార్టీ త్వ‌ర‌లో పార్ల‌మెంటుకు జ‌రిగే ఉప‌-ఎన్నిక‌లో పాల్గొన‌నుంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో త‌మ చేష్ట‌ల‌తో కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో ప‌డేశారు. వారిలో ఒక‌రు పోరిక బ‌లరాం నాయ‌క్‌ కాగా, మ‌రొక‌రు సిరిసిల్ల రాజ‌య్య. అవును! వీరిద్ద‌రి వ‌ల్ల పార్టీకి అంతులేని న‌ష్టం జ‌రిగింద‌ని సొంత‌పార్టీ నేత‌లు బ‌హిరంగంగానే చెప్పేస్తున్నారు. బ‌ల‌రాం అహంకార వ్యాఖ్య‌లు, రాజ‌య్య ఇంట్లోనే కోడ‌లు సారిక‌, ముగ్గురు మ‌న‌వ‌ళ్ల అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే వ‌రంగ‌ల్ పార్లమెంటు ఉప ఎన్నిక‌లో పార్టీకి న‌ష్టాన్ని క‌లుగ‌జేస్తాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ విష‌యంలో పైకి ఎంత స‌మ‌ర్థించుకుంటున్నా.. లోలోన పార్టీ అగ్ర‌నాయ‌కులు సైతం మ‌ద‌న‌ప‌డుతున్నారని స‌మాచారం.
గెలిపించ‌క‌పోతే.. ఆంధ్ర‌లో క‌లిపేస్తారా..?
ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో వ‌రంగ‌ల్‌లో ఓ బ‌హిరంగ స‌భ జ‌రిగింది. వేదిక‌పైకి ఎక్కిన బ‌ల‌రాం నాయ‌క్ రాబోయే వ‌రంగ‌ల్ పార్లమెంటు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేన‌న్న విష‌యం మ‌రువ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. అంత‌లోనే గెలిపించ‌క‌పోతే.. తెలంగాణ రాష్ర్టాన్ని తిరిగి ఆంధ్ర‌లో క‌లిపేస్తామ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ నేత‌లు లైట్ తీసుకున్నా.. తెలంగాణ వాదులు, ఇత‌ర‌పార్టీల నేత‌లు మాత్రం బ‌ల‌రాంనాయ‌క్ తీరుపై ధ్వ‌జ‌మెత్తారు. ఇవి అహంకార‌పూరిత వ్యాఖ్య‌లేనని మండిప‌డ్డారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌రాంపై ఎలాంటి క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
సారిక‌, పిల్ల‌ల‌ది హత్యా… ఆత్మ‌హ‌త్యా?
తెల్ల‌వారితే నామినేష‌న్ వేస్తార‌న‌గా.. రాజ‌య్య ఇంట్లో అత‌ని కోడ‌లు, ముగ్గురు మ‌న‌వ‌ళ్లు స‌జీవ ద‌హ‌నం కావ‌డం ఇప్పుడు జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం రేపింది. ఇది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా?అన‌్న చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. ఈ ఘ‌ట‌న‌తో ఉలిక్కిప‌డ్డ కాంగ్రెస్ పార్టీ అప్ప‌టిక‌ప్పుడు దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించి రాజ‌య్య స్థానంలో స‌ర్వేను నిల‌బెట్టింది. అయితే, జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌ని కాంగ్రెస్ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి చ‌ర్య‌లు త‌ప్ప‌కుండా ఓటింగ్‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని, ఇవే రేపు ప్ర‌త్య‌ర్థుల చేతిలో ఆరోప‌ణాస్ర్తాలుగా మార‌తాయ‌ని స్థానిక నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
First Published:  6 Nov 2015 1:17 AM GMT
Next Story