Telugu Global
CRIME

మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై విచారణ 16కు వాయిదా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిన అనంతరం కేసును న్యాయమూర్తి ఈనెల 16కు వాయిదా వేశారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని తన పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించాలని కోరుతూ మత్తయ్య తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే మత్తయ్య వేసిన పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని ఏసీబీ తరపు న్యాయవాదులు వాదించారు. […]

మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై విచారణ 16కు వాయిదా
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిన అనంతరం కేసును న్యాయమూర్తి ఈనెల 16కు వాయిదా వేశారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని తన పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించాలని కోరుతూ మత్తయ్య తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే మత్తయ్య వేసిన పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని ఏసీబీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేశామని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి మత్తయ్య తరపు న్యాయవాదులు గడువు కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఓటుకు నోటు కేసులో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇచ్చారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఏసీబీ అధికారులు మత్తయ్యను ఏ-4 నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.

First Published:  6 Nov 2015 10:40 AM GMT
Next Story