Telugu Global
Others

పొట్ట తగ్గించుకోండి ఇలా

అధిక బరువు.. ఇప్పుడు ఈ సమస్య దేశంలోని ప్రతి ఇద్దరిలో ఒకరిది. మన ఆహారపు అలవాట్లు మారుతున్న కొద్దీ స్థూలకాయం, అధిక బరువు సమస్యలు తీవ్రమవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి  పెద్ద వారి వరకు ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉరుకులు పరుగుల జీవితం. తిండి కూడా సరిగ్గా తినేందుకు తీరిక లేని పరిస్థితి. వేళాపాలా లేని తిండి కారణంగా ఇప్పుడు ఎవరిని చూసినా బాణ పొట్టలేసుకుని కనిపిస్తున్నారు. బరువు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం […]

పొట్ట తగ్గించుకోండి ఇలా
X
అధిక బరువు.. ఇప్పుడు ఈ సమస్య దేశంలోని ప్రతి ఇద్దరిలో ఒకరిది. మన ఆహారపు అలవాట్లు మారుతున్న కొద్దీ స్థూలకాయం, అధిక బరువు సమస్యలు తీవ్రమవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉరుకులు పరుగుల జీవితం. తిండి కూడా సరిగ్గా తినేందుకు తీరిక లేని పరిస్థితి. వేళాపాలా లేని తిండి కారణంగా ఇప్పుడు ఎవరిని చూసినా బాణ పొట్టలేసుకుని కనిపిస్తున్నారు. బరువు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదని ఆందోళన చెందుతుంటారు. ఎక్సర్ సైజ్ చేసి, చెమటోడ్చినా క్యాలరీలు తగ్గడం లేదంటుంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు.
డైటింగ్ తోనే సమస్య తీరదు:
బరువు తగ్గాలి అనుకోగానే మొదట చేసే పని డైటింగ్. అది అంత మంచిది కాదు. ముందు మీరు ఎంత తగ్గాలి అన్నది మీకు క్లారిటీకి ఉండాలి. లావు తగ్గాలన్నా, పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఉపవాసాలు అవసరం లేదు. వీలైనంత మేరకు ఆహారమైతే తినాల్సిందే. తినే విషయంలోనే పలు జాగ్రత్తలు పాటించాలి. పోషక పదార్ధాలు సమపాళ్ళలో ఉండేలా, పరిమిత ఆహారం తీసుకోవాలి.
సమయపాలన:
ఆహారంలో తెల్ల బియ్యం అదే మనం తినే సన్న బియ్యం కారణంగా పొట్ట పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి బదులు గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్రబియ్యం లాంటివి ఆహారంలోఉండేలా చూసుకోవాలి. ఉదయం పూట టిఫిన్ కాస్త ఎక్కువగా తీసుకన్నా ఆ తర్వాత తిండిని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. రాత్రి 7నుంచి 8గంటల భోజనం తినడం పూర్తిచేయాలి. అలాగే నిద్రపోయే వేళలు కూడా వీలున్నంత వరకూ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
వీలైనంత వరకు వంటల్లో ఉప్పును తక్కువగా వాడండి. ఉప్పుకి శరీరంలో నీటిని, కొవ్వును నిల్వ చేసే గుణం ఉంటుంది. దాంతో బరువు పెరుగుతారు. చలాకీ తనం తగ్గుతుంది. కాబట్టి రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా చూసుకోవాలి. ఇలా కనీసం 6వారాల పాటు క్రమం తప్పకుండా పాటించాలి.
వాకింగ్ బెస్ట్:
వాకింగ్ చేయడం చాలా ఒంటికి చాలా మాంచిది. కనీసం కిలోమీటరు దూరాన్ని 15 నిమిషాల్లో నడిచేలా సాధన చేయండి. రోజుకు సుమారు 3 కిలోమీటర్లు నడిస్తే మంచిది. కాళ్ళకు బలంతోపాటు పొట్టలో కొవ్వు కరుగుతుంది. ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు ఒంటికి అంత మంచివి కావు. ఉడికించిన కూరలు తింటేనే శరీరం మెరుగ్గా ఉంటుంది.
ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహార పదార్ధములు, తాజాగా ఉండే పండ్లు తీసుకోండి. నూనెలో ముంచి తేలిన చిప్స్, నూడిల్స్ , కురుకురేల వంటివి అస్సలు తినకూడదు. నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి. నీళ్లు ఎక్కువ తాగడంవల్ల ఆహారము తీసుకోవడం తగ్గుతుంది. వీటిలో కొన్నింటినైనా క్రమం తప్పకుండా పాటిస్తే మీ పొట్ట తగ్గడం ఖాయం.
First Published:  5 Nov 2015 11:07 PM GMT
Next Story