Telugu Global
International

ఫేస్ బుక్ నీలం రంగులోనే ఎందుకు?

మనం ఫేస్ బుక్ పేజీని ఓపెన్ చేయగానే లైట్ బ్లూ కలర్ పేజీలో కనిపిస్తుంది. ఎందుకు ఇలా కనిపిస్తోంది అని చాలా మందికి అనిపించకపోవచ్చు. కానీ దానికి ఓ కారణం ఉంది. అయనే ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్. జుకర్‌కి వర్ణ అంధత్వం ఉందట. జుకర్ రెడ్, గ్రీన్ రంగులను ఎక్కువగా చూడలేడు. కానీ నీలం రంగు మాత్రం బాగా కనిపిస్తుంది. అందుకే ఫేస్ బుక్‌లో దాదాపు అన్ని ఆప్షన్లు నీలం రంగులోనే కనిపిస్తాయి. కానీ […]

ఫేస్ బుక్ నీలం రంగులోనే ఎందుకు?
X
మనం ఫేస్ బుక్ పేజీని ఓపెన్ చేయగానే లైట్ బ్లూ కలర్ పేజీలో కనిపిస్తుంది. ఎందుకు ఇలా కనిపిస్తోంది అని చాలా మందికి అనిపించకపోవచ్చు. కానీ దానికి ఓ కారణం ఉంది. అయనే ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్. జుకర్‌కి వర్ణ అంధత్వం ఉందట. జుకర్ రెడ్, గ్రీన్ రంగులను ఎక్కువగా చూడలేడు. కానీ నీలం రంగు మాత్రం బాగా కనిపిస్తుంది. అందుకే ఫేస్ బుక్‌లో దాదాపు అన్ని ఆప్షన్లు నీలం రంగులోనే కనిపిస్తాయి. కానీ చిన్నప్పటి నుంచి జుకర్ బర్గ్ చాలా చురకైన వాడు. హైస్కూల్ లో చదువుతుండగానే సైనాప్స్ మీడియా ప్లేయన్ ను తయారు చేశాడు. అప్పట్లోనే ఏవోఎల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా జుకర్ బర్గ్ ను తమ సంస్థల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. కానీ జుకర్ బర్గ్ మాత్రం ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడలేదు.
చిన్నప్పటి నుంచే సొంతంగా ఏదైనా సృష్టించి అందరిలో ప్రత్యేకంగా ఉండాలన్నదే జుకర్ బర్గ్ లక్ష్యం. అందుకే ఎంత పెద్ద సంస్థలు ఉద్యోగం ఇస్తాం వచ్చినా యంగెస్ట్ బిలియనీర్‌గా గుర్తింపు పొందాలన్న తపన జుకర్ బర్గ్ లో ఉండేది. ఆ తపనే ఫేస్ బుక్ ను క్రియేట్ చేసేలా చేసింది. ఎంతలా అంటే ప్రపంచంలోనే అత్యంత యువ కుబేరుల జాబితాలో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల వయసులోనే 2,70,000 కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలోనే అత్యంత యువ సంపన్నుడిగా నిలిచారు. జుకర్ బర్గ్ కు ఓ చిన్న కుక్కపిల్ల ఉంది. అదంటే అతనికి ప్రాణం. అంతేకాదు.. జుకర్ తలుచుకుంటే ఎంత ఖరీదైన ఆహారాన్ని అయినా క్షణాల్లో కొనుక్కోగలడు. కానీ అతనికి అత్యంత ఇష్టమైనది మాత్రం వెజ్ బర్గర్ మాత్రమే.
First Published:  6 Nov 2015 10:21 AM GMT
Next Story