Telugu Global
National

వన్‌ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల

మాజీ సైనికుల్లో ‘అసహనం’ పెరగకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. మరో విధంగా చెప్పాలంటే మాజీ సైనికోద్యోగులకు కేంద్రం దీపావళి కానుక ఇచ్చింది. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ స్కీం తక్షణం వర్తింప జేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పథకం అమలుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మిగిలిన సౌకర్యాల మాదిరిగానే వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకాన్ని కూడా ఐదేళ్ళకోసారి సమీక్షించనున్నట్టు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇచ్చిన […]

వన్‌ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల
X

మాజీ సైనికుల్లో ‘అసహనం’ పెరగకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. మరో విధంగా చెప్పాలంటే మాజీ సైనికోద్యోగులకు కేంద్రం దీపావళి కానుక ఇచ్చింది. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ స్కీం తక్షణం వర్తింప జేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పథకం అమలుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మిగిలిన సౌకర్యాల మాదిరిగానే వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకాన్ని కూడా ఐదేళ్ళకోసారి సమీక్షించనున్నట్టు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ నోటిఫికేషన్‌ను దీపావళి ముందుగానే విడుదల చేయడం గమనార్హం. దీనికి వెనుక మరో కారణం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాల కారణంగా మత ‘అసహనం’ పేరుతో అనేక మంది ఇప్పటికే తమకు గతంలో లభించిన అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఇందులో సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీతలు, సినీ జాతీయ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తక్షణం వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ స్కీం అమలు చేయకపోతే తమకు లభించిన అవార్డులు తిరిగి ఇచ్చేస్తామని మాజీ సైనికోద్యోగులు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని తక్షణం అమలు చేయడానికి సిద్ధం పడడం గమనార్హం. ఈ పథకం వల్ల 25 లక్షల మంది మాజీ సైనికులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌తో మాజీ సైనికోద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

First Published:  7 Nov 2015 11:07 AM GMT
Next Story