Telugu Global
Cinema & Entertainment

మెగాకాంపౌండ్ ను టార్గెట్ చేసిన ఇలియానా

ఇలియానా.. ఈపేరు టాలీవుడ్ లో ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. ఆమె దురదృష్టం కొద్దీ బాలీవుడ్ లో కూడా వినిపించడం లేదు. దీంతో మరోసారి తన పేరు మారుమోగిపోయేలా చేసుకోవాలని తహతహలాడుతోంది ఇలియానా. దీనికి మెగాకాంపౌండ్ అయితేనే బెటరని భావిస్తోంది. అందులో భాగంగా మెగాహీరోలతో టచ్ లోకి వచ్చింది. ఇల్లీ బేబ్ టచ్ లోకి రావడంతో మెగాకాంపౌడ్ లో కనెక్షన్ పెడుతూ చాలా పుకార్లు వచ్చాయి. బ్రూస్ లీ సినిమాలో ఇలియానా ఐటెంసాంగ్ ఉందని కూడా వదంతులు […]

మెగాకాంపౌండ్ ను టార్గెట్ చేసిన ఇలియానా
X
ఇలియానా.. ఈపేరు టాలీవుడ్ లో ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. ఆమె దురదృష్టం కొద్దీ బాలీవుడ్ లో కూడా వినిపించడం లేదు. దీంతో మరోసారి తన పేరు మారుమోగిపోయేలా చేసుకోవాలని తహతహలాడుతోంది ఇలియానా. దీనికి మెగాకాంపౌండ్ అయితేనే బెటరని భావిస్తోంది. అందులో భాగంగా మెగాహీరోలతో టచ్ లోకి వచ్చింది. ఇల్లీ బేబ్ టచ్ లోకి రావడంతో మెగాకాంపౌడ్ లో కనెక్షన్ పెడుతూ చాలా పుకార్లు వచ్చాయి. బ్రూస్ లీ సినిమాలో ఇలియానా ఐటెంసాంగ్ ఉందని కూడా వదంతులు పుట్టాయి. కానీ అవన్నీ నిజంగా వదంతులే అని తర్వాత తేలిపోయాయి. తాజాగా ఇలియానాపై మరో పుకారు షికారు చేస్తోంది. మెగాహీరో రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాలో ఇలియానానే హీరోయిన్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు సురేందర్ రెడ్డి కూడా ఇలియానాకు క్లోజ్ కాబట్టి.. కచ్చితంగా అవకాశం దక్కినట్టేనని భావిస్తున్నారు. ప్రస్తుతం చెర్రీ అమెరికాలో ఉన్నాడు. అతడు హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ఈ రూమర్ పై ఓ క్లారిటీ వస్తుంది.
First Published:  6 Nov 2015 7:06 PM GMT
Next Story