Telugu Global
National

మొహాలీ మనోళ్లే మొనగాళ్లు

మొహాలీ టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సఫారీ టీమ్ పై 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో  నిలిచింది. ఉదయం 2వికెట్ల నష్టానికి 125 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 200 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ కు 217 పరుగుల ఆధిక్యం లభించింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ భారత స్పిన్నర్ల ధాటికి 109 పరుగులకే […]

మొహాలీ మనోళ్లే మొనగాళ్లు
X
మొహాలీ టెస్ట్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సఫారీ టీమ్ పై 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఉదయం 2వికెట్ల నష్టానికి 125 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 200 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ కు 217 పరుగుల ఆధిక్యం లభించింది. 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ భారత స్పిన్నర్ల ధాటికి 109 పరుగులకే చాపచుట్టేశారు.
స్పిన్‌కు అనుకూలించిన మొహాలీ పిచ్‌పై భారత స్పిన్నర్లు చెలరేగారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సఫారీ బ్యాట్స్‌మెన్‌ను విలవిలలాడించారు. సౌతాఫ్రికాను తొలి దెబ్బ తీసిన జడేజా..కీలక ఆమ్లా వికెట్ తీసి ప్రత్యర్ది టీమ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. ఆ తర్వాత అశ్విన్ మిగతా బ్యాట్స్‌మెన్ పనిపట్టాడు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ కు మూడు వికెట్లు, అమిత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది.
మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తం మీద తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, సెకండ్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా స్పిన్ తంత్రంతో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ లకు చుక్కలు చూపించారు.
First Published:  7 Nov 2015 6:14 AM GMT
Next Story