Telugu Global
International

ఆ సమయంలో లైట్లు ఆపేయండి: జర్మనీ మంత్రి షార్ట్ ఫిల్మ్

ఎక్కడ కొడితే జనంలో రీ సౌండ్ రేంజ్‌లో రియాక్షన్ వస్తుందో జర్మనీకి చెందిన ఓ మహిళా మంత్రి బాగా స్డడి చేశారు. అందుకే జర్మనీ పర్యావరణ శాఖ మంత్రి బార్బరా హెన్రిక్స్ … విద్యుత్ పొదుపు ప్రచారానికి ఓ కొత్త ఎత్తుగడ వేశారు. జనానికి ఏ విషయంపై ఎక్కువ ఆసక్తి ఉంటుందో ఆ విషయం ద్వారానే విద్యుత్ పొదుపును వివరించాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యంగా ఓ ఘాటైన షార్ట్ ఫిల్మ్ తీసి జనంలోకి వదిలారు. దాన్నే ప్రకటనల రూపంలో […]

ఆ సమయంలో లైట్లు ఆపేయండి: జర్మనీ మంత్రి షార్ట్ ఫిల్మ్
X

ఎక్కడ కొడితే జనంలో రీ సౌండ్ రేంజ్‌లో రియాక్షన్ వస్తుందో జర్మనీకి చెందిన ఓ మహిళా మంత్రి బాగా స్డడి చేశారు. అందుకే జర్మనీ పర్యావరణ శాఖ మంత్రి బార్బరా హెన్రిక్స్ … విద్యుత్ పొదుపు ప్రచారానికి ఓ కొత్త ఎత్తుగడ వేశారు. జనానికి ఏ విషయంపై ఎక్కువ ఆసక్తి ఉంటుందో ఆ విషయం ద్వారానే విద్యుత్ పొదుపును వివరించాలనుకున్నారు. అనుకున్నదే ఆలస్యంగా ఓ ఘాటైన షార్ట్ ఫిల్మ్ తీసి జనంలోకి వదిలారు. దాన్నే ప్రకటనల రూపంలో ప్రచారం చేస్తున్నారు.

సదరు యాడ్‌లో ఓ యువతి ఆర్థరాత్రి వేళ ఇంటికి వస్తుంది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ లైట్లు వేసుకునే ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇది చూసి ఆ అమ్మాయి తొలుత షాక్ అవుతుంది. తర్వాత లైట్లు ఆపేసి వెళ్లి పోతుంది. వెంటనే ”అనవసర సమయాల్లో లైట్లు ఆపేస్తే సేవ్ అయ్యే విద్యుత్… ఓ కోల్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్‌తో సమానం” అంటూ ట్యాగ్ లైన్ వస్తుంది. ఇలా లైట్స్ ఆపేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణకు మంచిదని జర్మనీ ప్రభుత్వం చెబుతోంది.

ఇదన్న మాట శ‌ృంగారాన్ని అడ్డుపెట్టుకుని జనంలో విద్యుత్ పొదుపుపై అవగాహనకు అక్కడి జర్మనీ మహిళా మంత్రి చేసిన ఆలోచన. మంత్రి వినూత్న ఆలోచనకు ఆ దేశంలో ప్రశంసలు వస్తుందన్నాయి. దేశంలో చర్చనీయాంశమైన యాడ్‌గా ఇది ప్రాచుర్యం పొందుతోంది.

First Published:  7 Nov 2015 6:00 AM GMT
Next Story