Telugu Global
Others

రైలు టిక్కెట్‌ రద్దు చేసుకుంటే జేబుకు భారీగా చిల్లే!

బుక్‌ చేసుకున్న రైలు టిక్కెట్లను రద్దు చేసుకోవాలంటే ఇక జేబుకు భారీగా చిల్లు పడినట్టే!. రైలు టిక్కెట్లు రద్దు చేసుకుంటే చెల్లించాల్సిన రుసుముల్ని రైల్వేశాఖ రెట్టింపు చేసింది. అసలైన ప్రయాణికులకు ధ్రువీకృత టిక్కెట్లు దక్కేలా చూడాలనే ఉద్దేశ్యంతో రద్దు నిబంధనల్లో మార్పులు చేసినట్టు ఆ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలను సమూలంగా మార్చి వేసింది. తిరిగి చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం రైలు బయలుదేరిన తర్వాత ఇక ఒక్కపైసా కూడా తిరిగి రాదు. […]

రైలు టిక్కెట్‌ రద్దు చేసుకుంటే జేబుకు భారీగా చిల్లే!
X

బుక్‌ చేసుకున్న రైలు టిక్కెట్లను రద్దు చేసుకోవాలంటే ఇక జేబుకు భారీగా చిల్లు పడినట్టే!. రైలు టిక్కెట్లు రద్దు చేసుకుంటే చెల్లించాల్సిన రుసుముల్ని రైల్వేశాఖ రెట్టింపు చేసింది. అసలైన ప్రయాణికులకు ధ్రువీకృత టిక్కెట్లు దక్కేలా చూడాలనే ఉద్దేశ్యంతో రద్దు నిబంధనల్లో మార్పులు చేసినట్టు ఆ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలను సమూలంగా మార్చి వేసింది. తిరిగి చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం రైలు బయలుదేరిన తర్వాత ఇక ఒక్కపైసా కూడా తిరిగి రాదు. ప్రయాణానికి నాలుగు గంటల ముందు మాత్రమే రద్దుకు అవకాశం ఉంటుంది. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండే వారికి, ఆర్‌ఏసీ ఉండే ప్రయాణికులకు అరగంట ముందు వరకు టిక్కెట్‌ రద్దుకు ఛాన్స్‌ ఉంది. ఆ తర్వాత ఎలాంటి చెల్లింపు ఉండదు. ఇక వివిధ తరగతులకు సంబంధించి తిరిగి చెల్లింపులను రైల్వేశాఖ ఈ కింది విధంగా వివరించింది. రెండో తరగతి ధ్రువీకృత టిక్కెట్‌ను 48 గంటల ముందు లోగా రద్దు చేసుకుంటే చెల్లించాల్సిన సొమ్మును రూ. 30 నుంచి రూ. 60కి పెంచారు. మూడో తరగతి ఏసీ టిక్కెట్‌పై రుసుమును రూ. 90 నుంచి 180కి పెంచారు. రెండో తరగతి స్లీపర్‌ బోగీల్లో టిక్కెట్‌ రద్దు రుసుమును రూ. 60 నుంచి 120కి పెంచారు. రైలు బయలుదేరడానికి 48 గంటల నుంచి 12 గంటల లోపు వరకు ప్రయాణ రద్దు రుసుమును టిక్కెట్‌లో 25 శాతంగా ఉండబోతోంది. ప్రయాణానికి 12 నుంచి 4 గంటల ముందు వరకు రద్దు రుసుము టిక్కెట్‌ ధరలో 50 శాతం ఉంటుంది. ఏజెంట్లు, బ్లాక్ మార్కెటీర్లను అదుపు చేసే చర్యల్లో భాగంగానే ఈ నిబంధనల్లో మార్పు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నిబంధనలు ఈ నెల 12వ తేదీ నుంచే అమల్లోకి వస్తున్నాయి.

First Published:  6 Nov 2015 9:06 PM GMT
Next Story