Telugu Global
Others

అవును... ఆ అమ్మాయిలిద్దరూ ఒక్కటయ్యారు!

ప్రేమ గుడ్డిది. దానికి కులం, మతం, ఆస్తి, అంతస్తులు అడ్డురావంటారు. ఇవే కాదు లింగబేధం కూడా అడ్డురాదంటున్నారు ఇద్దరు అమ్మాయిలు.  పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఒకసారి కాదు పెద్దలు విడదీసిన ప్రతిసారి పట్టింపుతో మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు.  నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అన్నామణి,  నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావువారిగూడెనికి చెందిన శ్రీదేవి వరుసకు వదిన మరదలు అవుతారు.  చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిలో శ్రీదేవికి కొద్దికాలం క్రితం వేరే […]

అవును... ఆ అమ్మాయిలిద్దరూ  ఒక్కటయ్యారు!
X

ప్రేమ గుడ్డిది. దానికి కులం, మతం, ఆస్తి, అంతస్తులు అడ్డురావంటారు. ఇవే కాదు లింగబేధం కూడా అడ్డురాదంటున్నారు ఇద్దరు అమ్మాయిలు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఒకసారి కాదు పెద్దలు విడదీసిన ప్రతిసారి పట్టింపుతో మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అన్నామణి, నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావువారిగూడెనికి చెందిన శ్రీదేవి వరుసకు వదిన మరదలు అవుతారు.

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిలో శ్రీదేవికి కొద్దికాలం క్రితం వేరే వ్యక్తితో పెళ్లి కూడా అయింది. అయినా సరే అన్నామణిని వదిలి ఉండలేకపోయింది. భర్తను వదిలేసి వచ్చింది. శ్రీదేవిని పెళ్లాడింది. విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరికి చివాట్లు పెట్టి బంధాన్ని బ్రేక్ చేయబోయారు. అయినా వారి మాటలు వీరి ప్రేమను కరిగించలేకపోయాయి.

కొద్దిరోజుల క్రితం కూడా ఇద్దరిని పెద్దలు వీడదీశారు. ఈ నేపథ్యంలో అన్నామణిని కలుసుకునేందుకు శ్రీదేవి మిర్యాలగూడ వచ్చింది. ఇది తెలుసుకున్న అన్నామణి కుటుంబసభ్యులు శ్రీదేవిపై దాడి చేశారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వచ్చి ఆరా తీయగా ఇద్దరమ్మాయిల పెళ్లి సంగతి వెలుగులోకి వచ్చింది.

అమ్మాయిలిద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. స‌ృష్టికి విరుద్ధంగా ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం సరికాదని నచ్చజెప్పేయత్నం చేశారు. అయినా వారిద్దరూ మాత్రం కలిసే ఉంటామని తేల్చి చెప్పారు. ఎవరు చెప్పినా విడిపోయేందుకు శ్రీదేవి, అన్నామణి అంగీకరించకపోవడంతో వారిద్దరి నుంచి సంతకాలు తీసుకుని పంపించి వేశారు పోలీసులు. అమ్మాయిలిద్దరూ మేజర్లే.

First Published:  6 Nov 2015 8:22 PM GMT
Next Story