Telugu Global
Others

అన్నిరకాల విటమిన్లు ఉంటేనే ఆరోగ్యం

శరీరానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్‌ ‘ఎం’ ఉంటే ఏ విటమిన్లయినా సొంతం చేసుకోవచ్చు. సొంత చేసుకుంటానే ఆరోగ్యం… కార్బోహైడ్రేట్లు, తగినన్ని కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ అందించే ఆహారం తీసుకోవడంవల్ల యుక్త వయసులో ఎదుగుదల, దృఢమైన శరీరం, రోగ నిరోధక శక్తి చక్కగా ఉంటాయి. ఎముకల బలానికి క్యాల్షియం, రక్తహీనత రాకుండా ఐరన్ కాపాడుతుంది. కాబట్టి భోజనంలో అన్నంతోపాటు పప్పు, ఆకు కూరలు, కూరగాయలు, గుడ్లు, మితంగా మాంసాహారం, పాలు, పెరుగు, పండ్లు […]

అన్నిరకాల విటమిన్లు ఉంటేనే ఆరోగ్యం
X
శరీరానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్‌ ‘ఎం’ ఉంటే ఏ విటమిన్లయినా సొంతం చేసుకోవచ్చు. సొంత చేసుకుంటానే ఆరోగ్యం… కార్బోహైడ్రేట్లు, తగినన్ని కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ అందించే ఆహారం తీసుకోవడంవల్ల యుక్త వయసులో ఎదుగుదల, దృఢమైన శరీరం, రోగ నిరోధక శక్తి చక్కగా ఉంటాయి. ఎముకల బలానికి క్యాల్షియం, రక్తహీనత రాకుండా ఐరన్ కాపాడుతుంది. కాబట్టి భోజనంలో అన్నంతోపాటు పప్పు, ఆకు కూరలు, కూరగాయలు, గుడ్లు, మితంగా మాంసాహారం, పాలు, పెరుగు, పండ్లు ఉండేలా చూసుకుంటే శరీరానికి ఆరోగ్యం సమకూరుతుంది. వీటితోపాటు పరిమితంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బయట జంక్‌ ఫుడ్స్‌ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అసలు తీసుకోకపోతే ఇంకా మంచిది. ఈ తిండివల్ల అధిక బరువు, దానితోపాటు శరీర, అంతర్గత రుగ్మతలు అనుసరిస్తాయి. కొంతమంది ఆడపిల్లలు సన్నగా నాజూగ్గా కనబడాలని, తిండి తినడం చాలా తగ్గించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ప్రతి అవయవం బలహీనంగా తయారవుతాయి. యోగ, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల వీరిలో శారీరక, మానసిక వృద్ధి కలుగుతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం పెరిగి, పాజిటివ్ ధృక్పథంతో ముందుకు వెళతారు.
మనిషి, శారీరకంగా, మానసికంగా ఎదగడానికి కార్పోహైడ్రేట్లు, కొవ్వు పదార్ధాలు, ఖనిజ లవణాలు అందించే ఆహారం తీసుకోవాలి. వీటితోపాటు విటమిన్లు కూడా అందించే ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారంలో ఏ విటమిన్లు ఉంటాయో తెలుసుకుంటే మనం ఆ దిశలో ఆహారాన్ని పొందడానికి వీలుంటుంది. చాలామంది ఏది దొరికితే అది తినేస్తారు. ధనవంతులు డైటీషియన్లను పెట్టుకుని వారు సూచించిన విధంగా ఆహారం తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఒక్క ధనవంతులే కాకుండా మీరు కూడా ఉన్నంతలో తీసుకునే ఆహారంలో మెళుకువలు తెలుసుకుంటే ఆరోగ్యం ఉండడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇపుడు మనం విటమిన్లు అవి శరీరానికి అందించే పోషక విలువలు గురించి తెలుసుకుందాం… ‘విటమిన్‌-ఎ’ కళ్ళు, చర్మం, మ్యుకస్, (శ్లేష్మము) పొర ఆరోగ్యంగా ఉండేందుకు, తక్కువ వెలుతురులో చూచే శక్తిని కలిగి ఉండేందుకు, అంటు రోగాల నుండి రక్షణకు చాలా ఉపయోగపడుతుంది. చర్మం మృదువుగా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ‘విటమిన్‌-బి’ పోషక పదార్థాలు శరీరంలో శోషణ చెందిన తరువాత ,శరీరం వాటిని ఉపయోగించుకోవటానికి ఈ విటమిన్ చాలా అవసరం. శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, మెదడు, నరాలు, కళ్ళు, జీర్ణావయవాలు ఆరోగ్యంగా పని చేసెందుకు బి విటమిన్‌ చాలా అవసరం. అలాగే రక్తంలోని ఎర్ర రక్త కణాల తయారికి ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి12 చాలా అవసరం. ‘విటమిన్‌-సి’ దంతాలు, చిగుళ్ళు, రక్తనాళాల సంరక్షణకు, గాయాలు, పుండ్లు త్వరగా మానటానికి, అంటువ్యాధుల నుండి రక్షణకు విటమిన్‌-సి అవసరం. ఇక ‘విటమిన్‌-డి’ ఎముకల నిర్మాణానికి, కాల్షియం అనే ఖనిజ లవణం శోషణకు, దానిని ఉపయోగించుకోవటానికి ఉపయోగ పడుతుంది. ఫాస్పరస్‌ను గ్రహించి నిలువ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ‘విటమిన్‌-ఇ’ అండాశయం విధి నిర్వాహణకు, చర్మం మృదువుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ‘విటమిన్‌-కె’ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ల ప్రాధాన్యత గుర్తించే కొంతమంది మనీని కూడా విటమిన్‌తో పోలుస్తూ ‘విటమిన్‌-ఎం’ అని వ్యవహరించడం మనం గమనిస్తూనే ఉన్నాం.
First Published:  7 Nov 2015 12:03 PM GMT
Next Story